Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

జోరుగా… ఖరీఫ్

Raised cotton, maize

ఊపందుకున్న పత్తి, మొక్కజొన్నసాగు                                                                                                                      వరి నార్లు అలుకుతున్న రైతులు
తప్పని నకిలీల బెడద                                                                                                                                              సాగుపై పెరిగిన ధరల భారం

మనతెలంగాణ/పెద్దపల్లి: ఈ నెల మొదటి వారంలో కురిసిన వర్షాలకు మొదలయిన ఖరీ ఫ్ పొలం పనులు గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఊపందుకున్నాయి. మొదటి వారంలో వేసిన మొక్కజొన్న, పత్తి ఇతర ఆరుతడి పంటలు మొలకలు రాగా ,బావులు ఇతర నీటి సౌలభ్యం ఉన్న ప్రాంతాలలో పోసిన నా రుమొలకెత్తింది. మధ్యలో పక్షం రోజులు వర్షాలు ఆశించిన స్థా యిలో కురవక పోవడంతో విత్తనాలు విత్తే ప్రక్రి యను రైతులు కొంత వరకు ఆపినా, దుక్కులు,దున్నడం నేలను చదును చేసి విత్తనాలు విత్తేం దుకు అవస రమైన ప్రక్రియను పూర్తి చేయడంతో గత రెండు రోజుల నుండి ఖరీఫ్ పనులు జోరందుకున్నాయి. పెద్దపల్లి జిల్లాలో 2 లక్షల 40వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని వ్యయసాయ శాఖ 2018ఖరీఫ్ యాక్షన్ ప్లాన్‌లో పేర్కొంది. లక్షా 35వేల ఎకరాల్లో వరి, 80వేల ఎకరాల్లో పత్తి,మిగతా విస్తీరంలో ఇతర ఆరుతడి పంటలు సాగు చేయనున్నారు. పత్తి ఇతర ఆరుతడి పంటలు సగానికి పైగా పూ ర్తి కాగా,జిల్లాలో మెజార్టీ సాగు విస్తీరమైన వరి సాగుకు సంబంధించి నారుమళ్లు పోయడం ఊపందుకున్నాయి.

తప్పని నకిలీల బెడద
గడిచిన ఖరీఫ్ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత సీజన్‌లో ప్రభుత్వం విత్తనాలపై అనేక జాగ్రత్తలు తీసుకున్నా నకిలీల బెడద తప్పడం లేదు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆధ్వర్యంలో పెద్దపల్లి,మంచిర్యాల జిల్లాల్లో గడిచిన రెండు నెలల కాలం లో పలుమార్లు నకిలీ విత్తనాలను పట్టకోవడం జరిగింది. ఆంధ్రాలోని గుంటూరు,నెల్లూరు తది తర ప్రాంతాలకు చెందిన దళారులు నకిలీ నిషేధిత పత్తి విత్తనాలను అక్రమంగా తీసుకు వచ్చి మూరుమూల గ్రామీణ ప్రాంతాల రైతులకు అంటగడుతున్నారు.
రైతులు నకిలీ విత్తనాల బారిన పడి నష్టపోకూడదని ఖరీఫ్ ఆరంభంలోనే వ్యవసాయ, పో లీస్,విజిలెన్స్ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక సెల్‌లను ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాల్లో తనిఖీలు ని ర్వహించి కేసులు నమోదు చేసింది. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా అక్కడక్కడా నకి లీ విత్తనాల బారిన పడి మోసపో తూనే ఉన్న నేపథ్యంలో రైతులు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు.

సాగుపై పెరిగిన ధరల భారం
ఎరువులు,డీజిల్ ధరలు పెరగడంతో ఖరీఫ్ రైతులకు కష్టాలు మొదలయ్యాయి.టన్నుకు 2 వేల వరకు ఎరువుల ధరలను పెంచడం,డీజిల్ ధరలు పెరిగాయని ట్రాక్టర్ యజమానులు వ్యవసా య పనుల ధరలను అమాంతం పెంచారు. గడిచిన ఏడాది మార్కెట్లో 1076 అమ్మిన 50 కిలోల డిఎపి ధర ప్రస్తుతం 1290 పలుకు తోంది. 20-20 కాంప్లెక్స్ ఎరువు ధర 873 ను ండి 930కి పెరిగింది.పెరిగిన ఎరువులు, డీజిల్ ధరలతో గడిచిన ఖరీఫ్ కు ఈ ఖరీఫ్‌కు ఎకరానికి 2వేలకు పైగా పెట్టుబడి వ్యయం పెరిగిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఖరీ ఫ్‌లో పెట్టుబడి సాయం కింద ఇచ్చిన నాలు గు వే లు పెరిగిన ధరలకు సరిపోతున్నాయని రైతు లు వాపోతున్నారు.

Comments

comments