Home సంగారెడ్డి పేద కుటుంబాన్ని ఆదుకున్న రైతుబంధు పథకం

పేద కుటుంబాన్ని ఆదుకున్న రైతుబంధు పథకం

Raithu Bandhu Scheme

సంగారెడ్డి: అనారోగ్య కారణాల వల్ల చనిపోయిన పేద రైతు కుటుంబం రైతుబంధు పథకం వల్ల లబ్ది పొందిన సంఘటన జిన్నారం గ్రామంలో జరిగింది. దోమడుగు యాదయ్య అతి పేద రైతు కుటుంబం. ఇతనికి భార్య దుర్గమ్మ కుమారుడు భాస్కర్ ఉన్నారు. యాదయ్య ఇటీవలె ఆరోగ్యం బాగాలేక చనిపోయారు. అయితే వీరికి 5 గుంటల భూమి ఉన్నది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం ఈ కుటుంబాన్ని ఆదుకుంది. రైతుబంధు పథకానికి ఇతను అర్హుడు అవ్వడం వల్ల ఇతనికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రభుత్వం ద్వారా అందింది. ఆ రూపాయలను అతని బాంక్‌లోకి నేరుగా జమ అవ్వడంతో జిల్లా యువ నాయకుడు వెంకటేశంగౌడ్ స్వయంగా అతని కుమారునికి అందించారు. చనిపోయిన రైతు భార్య దుర్గమ్మ మాట్లాడుతూ… కెసిఆర్ సార్ చేసిన సహాయం ఈ జన్మలో మరిచిపోనని అన్నారు. కెసిఆర్ చల్లగా ఉండాలని ఇంకా నాలాంటి పేదలకు సహాయం ఇలాగే కొనసాగించాలని కోరారు.

Raithu Bandhu Scheme for poor family in Sangareddy

Telangana Latest News