Home జాతీయ వార్తలు కొడుకు పెళ్లికి మోడీని పిలవని రాజ్‌థాకరే

కొడుకు పెళ్లికి మోడీని పిలవని రాజ్‌థాకరే

 

 

ముంబయి: మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ థాకరే తనయుడి పెళ్లి జనవరి 27న లోయర్ పారేల్ ప్రాంతంలోని సెయింట్ రీజిస్ హోటల్ లో జరుగుతుంది. తన కుమారుడి పెళ్లి అగ్ర రాజకీయ నాయకులను ఆహ్వానించారు. తనకు అత్యంత సన్నిహితంగా ఉండే హర్షల్ దేశ్ పాండే, మనోజ్ హతేల ద్వారా పెండ్లి పత్రికలు పంపించి ఆహ్వానించారు. ఆహ్వానాలు అందిన వారిలో బిజెపి సినీయర్ నేత అద్వాణీ, కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, మేనకా గాంధీ, సుష్మాస్వరాజ్, తదితరులున్నారు. ఈ సందర్భంగా రాజ్ థాకరేను మీడియా ప్రతినిధులు ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానిస్తున్నారా? అని అడిగారు. వివాహబంధాన్ని మోడీ నమ్ముతారా? అని థాకరే బదులు ప్రశ్నించారు. దీంతో మీడియా ప్రతినిధులు ఆశ్చర్యపోయారు. రాజ్ థాకరే కుమారుడు అమిత్ థాకరేను సంజయ్ బరుడ్ కూతురు మిథాలీ బరుడ్ తో జరుగుతుంది.