Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

రవితేజ ది గ్రేట్ అంటున్నారు

RAVI

రవితేజ, మెహరీన్ జంటగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాజా ది గ్రేట్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల దీపావళి సందర్భంగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా సినిమా సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ “ఈ సినిమా విజయం సాధించడంతో చాలా ఆనందంగా ఉంది. ఇందులోని నా క్యారెక్టరైజేషన్, డైలాగ్స్, పర్‌ఫార్మెన్స్ గురించి మంచి ప్రశంసలు వస్తున్నాయి. సాయికార్తీక్ మ్యూజిక్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. మెహరీన్ గోల్డెన్ లెగ్ హీరోయిన్. ఈ సినిమాతో తను హ్యాట్రిక్ హిట్స్ హీరోయిన్ అయింది. సినిమాను అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు అనిల్‌కు థాంక్స్. నేను తనను నమ్మాను. అలాగే అనిల్ కూడా నన్ను నమ్మాడు. ఒకరినొకరం నమ్మడంతోనే ఈ సక్సెస్ సాధ్యమైంది” అని అన్నారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ “ఒక సినిమా సక్సెస్ కావాలంటే ఓ పాజిటివ్ ఎనర్జీ మనతో ఉండాలి. నా టీం రూపంలో ఆ ఎనర్జీ నాకు దొరికింది. సినిమా సినిమాకు నా సినిమాల్లో నవ్వులు ఎక్కువ అవుతున్నాయని అందరూ అంటున్నారు. అది వింటుంటే కాస్త భయంగా కూడా ఉంది. ఎందుకంటే నెక్స్ సినిమాకు ఇంకెంతగా నవ్వించాలో అర్థం కావడం లేదు. ఈ సినిమా సక్సెస్‌ను బాగా ఎంజాయ్ చేశాం. ఇక అంధుడి క్యారెక్టర్‌తో సినిమా మొత్తాన్ని తెరకెక్కించాలంటే అంత సులభం కాదు. ఆ విషయంలో నన్ను నమ్మిన దిల్‌రాజు, శిరీష్‌లకు థాంక్స్. అలాగే నన్ను గుడ్డిగా నమ్మిన రవితేజకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఈ సినిమా చూసిన వారందరూ రవితేజ ది గ్రేట్ అని అంటున్నారు. రవితేజ చిన్నప్పటి క్యారెక్టర్‌లో ఆయన అబ్బాయి మహాధన్ చాలా చక్కగా నటించాడు. మెహరీన్ తన పాత్రకు న్యాయం చేసింది. ఈ సినిమా సక్సెస్‌తో తనను అందరూ గోల్డెన్ లెగ్ అని అంటున్నారు. ఇలాంటి ఒక మంచి సినిమా తీసినందుకు ఓ రచయితగా, దర్శకుడిగా గర్వంగా ఫీలవుతున్నాను”అని చెప్పారు. మెహరీన్ మాట్లాడుతూ “ఈ సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టాను”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శిరీష్, శ్రీనివాస్‌రెడ్డి, మోహనకృష్ణ, తమ్మిరాజు, సురేఖావాణి, రచ్చ రవి, రవిప్రకాష్, రఘుబాబు, సురేఖావాణి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments