Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

లడాయిపాటి

Rajagopal intercepted the arrest of accused in landlord

బంజారాహిల్స్ భూవివాదంలో  నిందితుడి అరెస్టును అడ్డుకున్న లగడపాటి రాజగోపాల్ 

మన తెలంగాణ/సోమాజిగూడ : ఉమేన్ కోఆపరేటివ్ సోసైటి స్థలం విషయంలో వివాదం చోటు చేసుకుంది. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన సంఘటన శుక్రవారం హైడ్రామాను తలపించింది. రోడ్డు నంబర్ 12లోని ఉమేన్ కోఆపరేటివ్ సోసైటీలో కల్పన అనే మహిళకు చెందిన స్థలాన్ని కడపకు చెందిన జిపి రెడ్డి తన కుతూరు శైలజ పేరున తప్పుడు పత్రాలతో సెల్ డెడ్ చేయించారు. అనంతరం తన అనుచరులచే స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించడంతో 2016లో కల్పన ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టి నిందితులపై 468,471,420 రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన జి.పి. రెడ్డి తనను అరెస్టు చేయకుండా న్యాయస్థానం నుంచి ముందస్తు బెయిలు తెచ్చుకున్నాడు. ఈ కేసులో మిగిలిన నిందితులను గతంలోనే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దీంతో బాధితురాలు కల్పన హైకోర్టును ఆశ్రయించి జి.పి.రెడ్డికి కింది న్యాయస్థానం ఇచ్చిన బెయిలును రద్దు చేయించింది.

అప్పటినుంచి జి.పి.రెడ్డి పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. కాగా జి.పి.రెడ్డి గత రాత్రి తన ఇంటికి వచ్చినట్లు అందిన పక్కా సమాచారం మేరకు బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేయడానికి శుక్రవారం ఉదయం అతని ఇంటికి వెళ్లారు. జి.పి.రెడ్డి అరెస్టు సమాచారంతో అక్కడికి చెరుకున్న అతని సన్నిహితుడు మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్ పోలీసులను అడ్డుకుని వారిని దుర్భాషలాడాడు. కాసేపు హైడ్రామాను నడిపి జి.పి.రెడ్డిని అరెస్టు చేయకుండా తెలంగాణ పోలీసులపై నానా మాటలు తూలాడు. జి.పి. రెడ్డిని ఏ విధంగా అరెస్టు చేస్తారని నిలదీయడంతో కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సంఘటన రాజకీయ రంగు పులుముకోవడంతో పోలీసులు వెనుదిరిగారు. జి.పి.రెడ్డిని అరెస్టు చేయకుండా బంజారాహిల్స్ పోలీసులు వదిలేశారు. చట్టప్రకారం వ్యవహరించలేదు.

నిందితునికి వత్తాసు పలికిన మాజీ ఎంపి…
మహిళ స్థలాన్ని తప్పుడు ధ్రువపత్రాలతో మోసం చేసిన జి.పి.రెడ్డి అరెస్టును అడ్డుకున్న మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్ వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నిందితున్ని కాపాడాల్సిన అవసరం లగడపాటికి అవసరమా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. న్యాయ స్థానం ఆదేశాలతో అరెస్టు చేయడానికి వస్తే పోలీసు విధులను అడ్డుకోవడమే కాక ,ప్రాంతీయతత్వాన్ని లేవదియడం వెనుక రాజకీయ కుట్ర ఉందని పలువురు విమర్శిస్తున్నారు.ఎన్నికలు జరుగుతున్న సమయంలో రాజగోపాల్ వ్యవహరిస్తున్న తీరు వెనుక మరే ఇతరత్ర కారాణాలు ఉన్నాయా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. పోలీసులు వెనుదిరగడం వెనుక ఓ యువ మంత్రి ఆదేశాలు ఉన్నట్లు బాధితురాలు అరోపిస్తున్నారు.

భూ వివాదంలో నాకు సంబందం లేదు : ఐజి నాగిరెడ్డి
పారిశ్రామిక వేత్త జిపి రెడ్డి వివాదంలో మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్ చేసిన ఆరోపణలపై ఐజి నాగిరెడ్డి స్పందిచాడు. తప్పుడు పత్రాలతో భూమిని కబ్జా చేసేందుకు యత్నించారని, ఈ కేసు విషయంలో పోలీసులపై తాను ఒత్తిడి చేయలేదని వివరించారు. జిపి రెడ్డి, ఆయన బంధువులతో ఎప్పుడూ తాను మాట్లాడలేదని నాగిరెడ్డి చెప్పారు. జిపి రెడ్డిపై చర్యలు తీసుకుంటే లగడపాటి ఎందుకు అడ్డు పడుతున్నారని ప్రశ్నించారు. లగడపాటికి ఈ భూమికి ఉన్న సంబంధాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో ఉన్న భూమికి తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. ఆ భూమి వ్యవహారంలో తన ప్రమేయం లేదని వివరించారు. రెండేళ్లుగా ఎలాంటి చర్యలు తీసుకుంటారా? అన్న విషయంపై తాను ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.

జిపి రెడ్డి గతంలో నకిలీ ధృవపత్రాలు సృష్టించి ఆ భూమిని విక్రయించేందుకు ప్రయత్నాలు చేశారన్నారు. విమెక్ కో ఆపరేటివ్ సోసైటిలోని మా కుటుంబ సభ్యుల, బాధిత సొసైటి సభ్యుల ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు జిపిరెడ్డి ఇంటికి వెళ్లారన్నారు. ఈ వివాదంలో లగడపాటి తరచూ తన పేరును ప్రస్తావించడం ఎంత మాత్రం సబబు కాదని నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలావుండగా గురువారం రాత్రి జిపి రెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఐజి నాగిరెడ్డి ఒత్తిడి మేరకు పోలీసులు తన మిత్రుడిని ఇబ్బంది పెడుతున్నారని లగడపాటి ఆరోపించారు.

అసలు కథ…

బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లోని స్థలం విషయంలో ఫోర్జరీ పత్రాలు తయారు చేసిన జీ పీ రెడ్డి.. ఉమెన్ కో ఆపరేటివ్ సొసైటీ చెందిన స్థలాన్ని కడప పట్టణానికి చెందిన ఐదుగురు వ్యక్తుల పేర్లతో సృష్టించారు.. వారి వద్దనుంచి జిపి రెడ్డి కూతురు శైలజ పెరుపైకి సేల్‌డీడ్ చేయించారు.. కాగా తమ స్థలాన్ని ఫోర్జరీ పాత్రలతో కబ్జా చేసేందుకు యత్నించారు అని ఉమెన్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కి చెందిన కల్పన అనే మహిళతో పాటు మరికొందరు బంజారా హిల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో 2016లో 468.471,420 రెడ్ విత్ 34కింద కేసు నమోదైంది. కేసులో జిపి రెడ్డి బినామీ లైన ఐదుగురితో పాటు ఫోర్జరీ పత్రాలను తయారు చేసిన మోహన్ దాస్ అన్ వ్యక్తిని అప్పుడే అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన కుట్రదారుడైన జిపి రెడ్డి తనని అరెస్ట్ చెయ్యకుండా ఎఎంఎస్‌జె కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో జిపి రెడ్డికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దాంతో బాధితులు హై కోర్టును ఆశ్రయించారు. కింది కోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేస్తూ ఈ ఏడాది జూన్ 4న తీర్పు ఇచ్చింది. హై కోర్టు బెయిల్ రద్దు చేసినప్పటి నుంచి పరారీలో ఉన్న జిపి రెడ్డి గురువారం రాత్రి ఇంటికి వచ్చాడని సమాచారం అందుకున్న బంజారా హిల్స్ పోలీసులు జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసం వద్దకు చేరుకుని అరెస్ట్ చేసేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న లగడపాటి ఘటనాస్థలికి చేరుకుని తెలంగాణా పోలీసులపై, ఐజి నాగిరెడ్డిపై ఆరోపణలు చేశారు.

Rajagopal intercepted the arrest of accused in landlord

Telangana Latest News

Comments

comments