Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

చీకటి వీడని చాకలి బతుకులు

Dhobi-Ghats

దోబీఘాట్లు ఉన్నా.. ఉపయోగం సున్నా
నీటి సౌకర్యం లేక ఇబ్బందుల్లో రజకులు

ముథోల్ : మండలకేంద్రంతోపాటు ఆ యా గ్రామాల్లో ఉన్న రజకుల సౌకర్యర్థం కోసం కులవృత్తి నిర్వహణ పూర్తిగా నష్టపోతున్నారు. మండలంలోని తరోడ , ఎడ్‌బిడ్, సాలాపూర్, కౌట, వడ్తాల, చించాల, మచ్కల్ తదిత ర గ్రామాల్లో రజకులకు బట్టలు ఉతకడానికి ప్రభుత్వం రూ 2లక్షలను వెచ్చించి ఆయా గ్రామాల్లో ఊరికి దూరంగా పొలిమేర్లలో దోబీఘాట్లను నిర్మించి నీటి వసతిని కల్పించక పోవడం ఇందుకు కారణం. దీంతో రజకులు స్థాని చెరువు ల్లో కుంటల్లో, మురికినీటిలో బట్టలను శుభ్రం చేస్తున్నారు. వేసవి కాలం కావడంతో చెరువుల్లో నీరుపూర్తిగా ఎండి పోవడంతో కులవృత్తులు మానుకుంటున్నారు.

నాణ్యతాలోపంతో పగుళ్లు
మండలంలోని ఎడ్‌బిడ్ గ్రామంలో ఊరి చివర ఏర్పాటు చేసిన దోబీఘాట్‌ను నిర్మించినప్పటికి బోరుబావి నీరు లేకపోవతంతో దోబిఘాట్‌కు పగుళ్లు తెలి శిథిలావస్థకు చేరుకుంటున్నారు. సాలాపూర్,కౌటగ్రామంలో గత ఐదు సంవత్సరాల క్రితం నిర్మించిన దోబిఘాట్లకు బోరు మోటర్లు వేసినప్పటికి నీరులేకపోవడంతో నేటికి వృధాగా దర్శమిస్తున్నాయి. ముథోల్ మండలకేంద్రం లో ఊరు చెరువులో రజకుల సౌకర్యర్థం కోసం గత ఏడు సంవత్సరాల క్రితం దోబిఘాట్‌ను నిర్మించారు. సంబంధిత బోరుబావిని బిగించినప్పటికి రెండు మా త్రమే పనిచేసిందని రజకులు తెలిపారు. నాలుగు సంవత్సరాల నుండి బోరుబావికి నీళ్లు లేకపోవడంతో దోబిఘాట్ నిరుపయోగం మారిందన్నారు. మండల కేం ద్రంలో 100 మంది రజకకు టుంబాలున్నాప్పటికీ రజక వృత్తిని నమ్ముకోని జీవిస్తున్నారు. చెరువుల్లో నీళ్లు లేకబోరు బావికి నీరులేక పగుళ్లు తెలిన బోరుబావి పనిరాకుండా పో యిందన్నారు. చేసేది ఏమిలేక కూలీ పనులకు వెళ్తున్నామ ని రజకులు వాపోతున్నారు.

నిర్మించారు… వదిలేశారు
మండల కేంద్రంలోని కొత్తగా రూ 4లక్షల 50వేలతో గత సంవత్సరం క్రితం నిర్మించినప్పటికి సంబంధిత బోరుబా విని బిగించిన నీరు పడకపోవడంతో అది కూడా వృధాగానే ఉంటుందని రజకులు తెలిపారు. గత ఎనిమి ది నెలల క్రితమే కొత్తగా నిర్మించినట్లు వారుతెలిపారు.
ఆయా గ్రామాల్లో చెరువుల సమీపంలోనిర్మించిన దోబిఘాట్ల వద్ద బోరులేక నిరుపయోగంగామారాయి. రజకులకు సరైన సదుపాయాలు లేక అరకొరగా వసతుల మధ్య దోబిఘాట్ల వద్ద బట్టలను ఉతకలేకపో తున్నామని వారు వాపోయారు. గ్రామంలో బోరుఉన్న వారి ఇంటి వెళ్లి బట్టలను ఉతికి పొట్టనింపుకుంటున్నామన్నారు.

Comments

comments