Home తాజా వార్తలు ‘ ఇండియన్ ఆఫ్ ద ఇయర్ ’… రాజమౌళి

‘ ఇండియన్ ఆఫ్ ద ఇయర్ ’… రాజమౌళి

SS-IOYహైదరాబాద్: ‘ బాహుబలి ’ చిత్రంతో తెలుగు సినిమాస్థాయిని ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళికి మరో అరుదైన గౌరవం దక్కింది. సిఎన్‌ఎన్-న్యూస్ 18 సంయుక్తంగా ప్రతిష్ఠాత్మకంగా అందించే ‘ ఇండియన్ ఆఫ్ ద ఇయర్ ’ పురస్కారం రాజమౌళిని వరించింది. ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో రాజమౌళి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ రాజమౌళికి ఈ పురస్కారాన్ని అందించారు. రాజమౌళితో పాటు బాలీవుడ్ నటి కంగనా రనౌత్, నటుడు రన్‌వీర్ సింగ్, బాడ్మింటన్ క్రీడాకారుడు లియాండర్ పేస్, టెన్నీస్ క్రీడాకారిణి సానియా మీర్జాలకు పురస్కార ప్రధానం జరిగింది.