Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

యూరప్ వెళ్లనున్న రజనీ

Rajanikanth 165 movie Shooting Start in Chennai

సౌతిండియా సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 165వ చిత్రం షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ కోసం యూరప్ వెళ్లనుంది సినిమా యూనిట్. ఈ షెడ్యూల్ తర్వాత లఢక్‌ లో ఓ షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రం టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను వినాయక చవితి సందర్భంగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. సిమ్రాన్, నవాజుద్దీన్ సిద్దిఖీ, ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి, బాబీ సింహ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. రజనీ గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్
సంగీతాన్ని అందిస్తున్నాడు.

Comments

comments