Home రాష్ట్ర వార్తలు పెరట్లో పెంచుకోండి “రాజశ్రీ”తో రాణించండి

పెరట్లో పెంచుకోండి “రాజశ్రీ”తో రాణించండి

Hensఇంటి ఆవరణలో పెంచుకోనే నాటు కోళ్లకంటే చిన్న రైతులు తమకు ఉన్న తక్కువ స్థలంలో పెరటిలో రాజశ్రీ కోళ్లు పెంచుకుంటే అవి మాంసంతో పాటు నాణ్యమైన గుడ్లు పెడుతాయి. దేశావాలీ కోళ్లతో పోలిస్తే ఇవి అన్నిరకాలుగా వాటికంటే శ్రేష్టమైనవని, రుచికరమైనవి. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ కృషి విజ్ఞాన కేంద్రం కో-ఆర్డినేటర్ డా. ఎం జగన్‌మోహన్‌రెడ్డి, డా. రాజేష్‌లు రాజశ్రీ కోళ్ల  పెంపకం, లక్షాలు ఇతర గుణాల గురించి వివరించారు. ఆ వివరాలు వారి మాటల్లోనే…

భారతదేశం ప్రపంచ కోడి గుడ్ల ఉత్పత్తిలో మూడో స్థానంలో, మాంసం ఉత్పత్తిలో అయిదో స్థానంలో ఉంది. చైనా మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలో 4౦ శాతం గుడ్లు చైనాలో ఉత్పత్తి అవుతాయి. ఇందులో 80 శాతం గుడ్లు గ్రామీణ ప్రాంతాల నుంచి లభిస్తున్నాయి. చైనాలో గ్రామీణ ప్రాంతాల్లో కోళ్ల పెంపకం బాగా అభివృద్ధి చెందింది. కానీ, రోజురోజుకు మనదేశంలో పెరటి కోళ్ల పెంపకం మరుగున పడిపోతోంది. మన దేశ జనాభాలో 70 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. సాధా రణంగా వ్యవసాయ, పశు సంబంధ ఉత్పత్తులు గ్రామాల నుంచి పట్టణాలకు వస్తాయి. కానీ కోళ్ల సంబంధ ఉత్పత్తులు ఎక్కువగా నగర శివార్లలో ఉత్పత్తి అయి గ్రామాలకు వెళ్తు న్నాయి. ఉత్పత్తుల ధరలు పల్లె ప్రాం తంలో 10-40 శాతం అధికంగా ఉన్నా యి. అందువల్ల గ్రామీణ ప్రాంతాల్లో పోషక పదార్థాల కొరత ఏర్పడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు సమతుల్యమైన పోషకాహారం ఇవ్వాలంటే వారికి చౌకగా లభించే కోడి గుడ్లు, కోడి మాంసం అందు బాటులోకి తీసుకురావాలి. పెరటి కోళ్ల పెం పకం ఇంటిల్లి పాదికి సమతుల్యమైన ఆహా రాన్ని అందివ్వటంతో పాటు, అదనపు ఆదా యాన్ని కూడా ఇస్తుంది. గ్రామాల్లో రైతు సోదరులు ఇంటి దగ్గర పెంచుకొనే దేశ వాళీ కోళ్లు చిన్నవిగా ఉండి, తక్కువ గుడ్లు (4౦-6౦) పెడతాయి. అందువల్ల వీటికి ప్రత్యా మ్నాయంగా ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం వారు ఎక్కువ గుడ్లు (సుమారు 15౦ వరకు), ఎక్కువ మాంసా న్నిచ్చే మేలుజాతి పెరటికోడిని అభివృద్ధి చేశారు. దానికి ‘రాజశ్రీ’ అని పేరు పెట్టారు. గిరిరాజా, వనరాజా కోళ్ళతో పోలిస్తే రాజశ్రీ కోడి ప్రత్యేకమైంది. ఎందుకంటే, ‘రాజశ్రీ’ తయారీలో మూడు విదేశీ జాతి కోళ్లతో పాటు, దేశవాళీ కోళ్ల రక్తాన్ని (25 శాతం) ఉపయోగించారు. గ్రామీ ణ ప్రాంతాల్లో పెరటిలో పెంప కానికి ఉపయోగించే జాతిలో ఉండాల్సిన లక్షణాలన్నీ కలిగి ఉండేలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసు కున్నారు. ఈ కోళ్లు కుక్కలు, పిల్లుల బారి నుంచి తేలికగా తప్పించుకుంటాయి. అంతేగాక వీటి మాంసం మంచి రుచి, వాస న కలిగి ఉండటం ప్రత్యేకత.

పిల్లలు ఎక్కడ దొరుకుతాయి?
రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం (ఎఐసి ఆర్‌పి) పౌల్ట్రీ ఫాం సెక్షన్‌లో లభి స్తాయి. ముందుగానే ఫాం మేనేజర్‌కు ఎన్ని కావాలో వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కరోజు కోడి పిల్ల ధరకు రూ.18 ఉం టుంది. ఐదు వారాల వయసు గల కోడికి రూ.60 ఉంటుంది. ఎక్కువ మొత్తంలో కోడిపిల్లలు కావాల్సిన వాళ్ళు ముందుగానే సం బంధిత పశుసంవర్ధక అధికా రులను సంప్రదించాలి. ఐదు వారాల వయసు వరకు దీనికి ఎలాంటి రోగాలు రాకుండా టీకాలు, మందులు కూడా అందులోనే ఇస్తారు. పిల్ల దశలో ఉన్న ప్పుడు తీసుకుని అది పెద్దగా అయ్యేదాకా పోషించి, సంతలో, చికెన్ సెంటర్‌లో కూడా అమ్ముకోవడా నికి వీలు ఉంటుంది. ఎన్ని కిలోల వరకైనా వీటిని పెంచుకోవచ్చు.

యాజమాన్యంలో మెళకువలు 

రాజశ్రీ కోళ్లు 6 నెలల వయస్సు నుంచి గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయి. గుడ్లు పెట్టే సమయంలో 3-4 గ్రాముల ఆల్చిప్పల పొడి లేదా సున్నపు రాయి పొడిచి వారానికి రెండుసార్లు ఇస్తే తోలుగుడ్లు పెట్టకుండా నివారించ వచ్చు. మనకు స్థానికంగా లభించే జొన్న, మొక్కజొన్న తవుడు, బియ్యం గింజలతో దాణా తయారుచేసుకుని, మేపితే కోళ్లు ఆరోగ్యంగా పెరుగుతాయి. రాత్రిపూట ఉండటానికి చిన్న షెడ్ ఏర్పాటుచేస్తే చాలు. పరాన్న జీవుల నివారణ కోళ్ళు ఆరు బయట పెరుగుతుంటా యి. కాబట్టి అంతరపరాన్న జీవుల బెడద ఎక్కువగా ఉం టుంది. నివారణకు పైపరజిన్ అడిఫేట్ అనే నట్టల మం దును ఒక చెంచా చొప్పున అరలీటరు నీటిలో కలిపి కోడి కి 5-1౦ మి.లీ. చొప్పున తాగించాలి. ఇలా ప్రతి మూడు నెలలకు చేయాలి. అలాగే క్రమం తప్పకుండా కొక్కర వ్యాధి టీకాలు వేయించి వ్యాధి రాకుండా నివారింవచ్చు.

రాజశ్రీ ముఖ్య లక్షణాలు

రాజశ్రీ కోడి శరీర పరిమాణం మధ్యస్థంగా ఉండి, మాంసం గుడ్లు ఉత్పత్తికి అనువుగా ఉంటుంది.
పొడవైన, బలమైన కాళ్ళు ఉండి, చురుకుగా కదులుతూ పిల్లులు, కుక్కల నుంచి సులభంగా తప్పించుకోగలవు.
వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ. ముదురు ఎరుపు రంగు ఈకలతో పూర్తిగా నాటుకోళ్ళను పోలి ఉంటుంది.
పెరట్లో దొరికే గింజలు, చెదలు పురుగులు, గడ్డి, వంటగది వ్యర్థాలను బాగా వినియోగించుకుంటాయి.
ఉత్పత్తి సామర్థం
8 వారాల వయస్సులో కోడి పిల్లల బరువు
పెట్టపిల్ల -5౦౦ గ్రా॥ పుంజుపిల్ల – 55౦ గ్రా॥
16 వారాల వయస్సులో
పెట్టకోడి -13౦౦ గ్రా॥ పుంజుకోడి బరువు 15౦౦ గ్రా
2౦ వారాల వయసులో బరువు
పెట్ట -15౦౦ గ్రా॥ పుంజు -175౦ గ్రా॥
మొదటి గ్రుడ్డు పెట్టే వయస్సు 16౦ రోజులు
ఒక సంవత్సరంలో గుడ్ల ఉత్పత్తి -16౦ నుంచి 17౦
గుడ్డు బరువు -55 గ్రాములు