Search
Saturday 17 November 2018
  • :
  • :

ఆమెను పెళ్లి చేసుకుంటే 11లక్షలు కట్టాలట..!

Rajasthan Panchayat cruel verdict in child marriage issue

జైపూర్: రాజస్థాన్ లో జరిగిన ఈ ఘటనను మూఢనమ్మకం అనాలో.. లేక ముర్ఖత్వం అని చెప్పాలో తెలియదు. ఎప్పుడో తెలిసీ తెలియని వయసులో పెద్దలు ఓ బాలుడితో నిశ్చితార్థం చేశారు ఆ అమ్మాయికి. అయితే, వయసు వచ్చిన తరువాత నిరక్షరాస్యుడైన అతడితో తనకు పెళ్లి వద్దని చెప్పినందుకు ఆ అమ్మాయి కుటుంబంపై దారుణమైన తీర్పు ఇచ్చారు పంచాయతీ పెద్దలు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…  నాగౌర్ జిల్లాలోని పీల్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని బాంసెడ్ గ్రామంలో నివాసముండే నౌరత్ బావ్లాకు చాలా ఏళ్ల క్రితం మూడేళ్ల బాలికతో నిశ్చితార్థం జరిపించారు. ఈ క్రమంలో నౌరత్ చదువు సంధ్యలేకుండా ఆవారగా మారాడు. కానీ, యువతి చదవుకుని మంచి పరిణితి సాధించింది. వారి పెళ్లి చేసేందుకు పెద్దలు ప్రయత్నించారు. దాంతో చదువు, సంధ్య లేని నౌరత్ ను పెళ్లాడేందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగి, విషయం కాస్తా పంచాయతీ పెద్దల వద్దకు వెళ్లింది. పెళ్లిని వద్దన్నందుకు ఆ కుటుంబాన్ని సమాజం నుంచి వెలివేస్తూ వారితో మాట్లాడితే రూ. 5,100 జరిమానా చెల్లించాలని చెప్పింది. అలాగే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునే వారు ఎవరైనా సరే రూ. 11 లక్షలు జరిమానాగా చెల్లించాలని పంచాయతీ తీర్పు ఇచ్చింది. దీంతో బాధిత కుటుంబం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు పంచాయతీ పెద్దలను అదుపులోకి తీసుకున్నారు.

Comments

comments