Home తాజా వార్తలు కేంద్ర ఎన్నికల కమిషనర్ తో రాజీవ్ శర్మ భేటీ…

కేంద్ర ఎన్నికల కమిషనర్ తో రాజీవ్ శర్మ భేటీ…

Rajeev Sharma meeting with Central Election Commissioner

హైదరాబాద్: తెలంగాణలలో ముందస్తు ఎన్నికలకే సిఎం కెసిఆర్ మొగ్గు చూపుతున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసాతో గురువారం టిఆర్ఎస్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ భేటీ ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది. తెలంగాణ అసెంబ్లీ ముందస్తు ఎన్నికల గురించి ఈ భేటీలో చర్చించినట్టు సమాచారం. ఈ భేటీకి తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కెఎం సహానీ కూడా హాజరయ్యారు. ముందస్తు ఎన్నికల నిర్వహణ, సాధ్యాసాధ్యాలపై వీరు చర్చించినట్టు తెలుస్తోంది. ఆ తరువాత అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ తో కూడా రాజీవ్ శర్మ కలిశారు. ఈ పరిణామాల నేపథ్యంలో, ముందస్తు ఎన్నికల కోసం తెలంగాణ ప్రతినిధులు ఢిల్లీలో కసరత్తును ముమ్మరం చేసినట్టు అర్థమవుతోంది. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లకపోవడమే మంచిదనే అభిప్రాయాన్ని కెసిఆర్ కు మెజార్టీ మంత్రులు సూచించినట్టు తెలుస్తోంది.