Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ఊగిసలాటలో రజనీ ?

Rajinikanth

చెన్నయ్ : రాజకీయాల్లోకి రావాలా … వద్దా అన్న ఊగిసలాటలో తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఉన్నారు. రజనీ రాజకీయాల్లోకి వస్తారా … రారా అన్నదానిపై ఇప్పటికే పలు ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే తన రాజకీయ ప్రవేశంపై రజనీకాంత్ రాజకీయ నేతలతో చర్చిస్తున్నారు. కానీ రాజకీయ ప్రవేశంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని రజనీ తెలిపారు. ఒక వేళ తాను రాజకీయాల్లోకి వస్తే ముందుగా మీడియాకు తెలియజేస్తానని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ అంశంపై ప్రస్తుతం చర్చలు చేస్తున్న మాట వాస్తవమేనని, అయితే తాను ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేదని ఆయన తేల్చి చెప్పారు.

Comments

comments