Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

వాయిదాపడ్డ రజనీ సినిమా

Rajinikanthసూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా వచ్చిందంటే అభిమానులకు పండగే. అయితే ఆయన గత చిత్రాలు కొచ్చాడియాన్, లింగా సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసి రజీనికి పెద్ద పరీక్ష పెట్టాయి. దీంతో కొత్త తరం దర్శకులైతే తనను మళ్లీ కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తారన్న ఆలోచనతో రజనీ… యువ దర్శకుడు రంజిత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించిన విషయం తెలిసిందే. రాధికా ఆప్టే ఈ సినిమాకు హీరోయిన్‌గా ఎంపికైంది. ప్రముఖ తమిళ నిర్మాత కలైపులి థాను ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో భారీ ఎత్తున నిర్మించనున్నారు. గత నెల రోజుల నుంచి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ముందుగా అనుకున్న దానిప్రకారం ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఈనెల 18 నుంచి మలేషియాలో మొదలవ్వాలి.

కానీ ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ వాయిదాపడింది. తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్ 18న సినిమా మొదటి షెడ్యూల్ ప్రారంభంకానుంది. ఖచ్చితంగా హిట్ కొట్టి తీరాలన్న కసితో ఈ సినిమా విషయంలో రజనీ జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. సినిమాలో రజనీకాంత్ ఓ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నాడు. అది కూడా తన వయసుకు సరిపోయే పాత్ర అని సమాచారం. ఈ సూపర్‌స్టార్ సరసన రాధికా ఆప్టేని హీరోయిన్‌గా ఫైనలైజ్ చేయగా ప్రకాష్‌రాజ్, జెడి చక్రవర్తి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందించనున్న ఈ సినిమాకు పలువురు యంగ్ టాలెంటెడ్ టెక్నికల్ టీం పనిచేయనుంది. సినిమా షూటింగ్ మొదలుపెట్టిన 45 రోజుల్లోనే రజనీకాంత్ తన పార్ట్‌కి సంబంధించిన షూటింగ్‌ను పూర్తిచేయనున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన రోబో 2 సినిమా షూటింగ్‌లో పాల్గొంటాడు.

Comments

comments