Search
Wednesday 21 November 2018
  • :
  • :

మాట్లాడకుండా వచ్చేశారు

RajaniKanth Upcoming 2.0 Movie budjet 500 Crore

రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన ‘2.0’ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ‘రోబో’కి సీక్వెల్‌గా  శంకర్ దర్శకత్వంలో ఈ సినిమాను రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్‌కి సంబంధించిన పనులు పూర్తి కాకపోవడంతో పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు ఇటీవలే విడుదల తేదీని ఖరారు చేసుకుంది. నవంబర్ 29న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు దర్శకుడు శంకర్ వెల్లడించాడు. అయితే ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. పలుమార్లు సినిమా విడుదల వాయిదా పడటంతో ఈ చిత్రం హక్కులు కొనుగోలు చేసిన పలు ప్రాంతాల డిస్ట్రిబ్యూటర్లు అంతా తమ డబ్బుని వెనక్కిచ్చేయాలని నిర్మాతలపై ఒత్తిడి తీసుకొచ్చారట. విడుదల తేదీని ఖరారు చేశాక కూడా కొంత మంది ఇదే డిమాండ్ చేశారట. అందులో తెలుగు డిస్ట్రిబ్యూటర్ కూడా ఉన్నట్టు తెలిసింది. ఈ విషయం శంకర్ దృష్టికి రావడంతో ఆయన డబ్బు తిరిగి ఇచ్చేయమని అడిగిన వాళ్లందరినీ చెన్నైకి పిలిపించి చిత్రంలోని 15 నిమిషాల ఫుటేజీని ప్రత్యేకంగా చూపించాడట. అది చూశాక వాళ్లంతా మరో మాట మాట్లాడకుండా తిరిగి వచ్చేశారట. సినిమాలోని సన్నివేశాలు అంత బాగా నచ్చాయట. ఆలస్యమైనా పర్వాలేదు కానీ సినిమా సంచలనాలు సృష్టించడం ఖాయమని డిస్ట్రిబ్యూటర్లు అంతా ఆనందంగా ఇంటికొచ్చారట. మరి ‘2.0’ సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్‌లో అలరిస్తుందో చూడాలి.

Comments

comments