Search
Saturday 17 November 2018
  • :
  • :

రాజీవ్ హంతకుల విడుదలకు తమిళనాడు మంత్రివర్గ నిర్ణయం

గవర్నర్‌ని కోరనున్న పళని ప్రభుత్వం

Rajiv-Gandhi 

చెన్నై : రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న ఏడుగురిని విడుదల చేయాలని తమిళనాడు ఎఐఎడిఎంకె ప్రభుత్వం నిర్ణయించింది. వారి విడుదలకు ఉత్తర్వులు ఇవ్వాలని గవర్నర్‌ని కోరాలని మంత్రివర్గం తీర్మానించింది. ముఖ్యమంత్రి కె పళనిస్వామి ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామని మత్య శాఖ మంత్రి డి జయకుమార్ మీడియాకు చెప్పారు. గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్‌ని కలిసి ఏడుగురిని విడుదల చేయాలని కోరుతామని ఆయన తెలిపారు. రాజీవ్ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న మురుగన్, సంతన్,పెరవివలన్, జయకుమార్, రవిచంద్ర, రాబర్ట్ పయాస్, నళినిలను విడుదల చేయమని గవర్నర్‌ని కోరుతామని ఆయన చెప్పారు.

జీవితఖైదీ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ని ఆమోదించమని గతవారం సుప్రీంకోర్టు ధర్మాసం గవర్నర్‌కు తెలిపింది. వారి విడుదలను వ్యతిరేకిస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌ని సుప్రీంకోర్టు కొట్టి వేసింది. క్షమాభిక్ష పెట్టమని ఖైదీ పరివివలన్  కోరాడు. అ యితే ఆయనతో పాటు మిగతా వారిని కూడా విడుదల చేయాలని త మిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. వారిలో ఆరుగురు  తమ శిక్షాకాలాన్ని తగ్గించాలని ప్ర భుత్వాన్ని కోరారు. విడుదలపై మంత్రివర్గం చేసిన తీర్మానాన్ని వెంటనే పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1991, మే 21న ఎల్‌టిటిఇకి చెందిన  థాను  శ్రీపెరంబుదూర్‌లో రాజీవ్ గాంధీపై  చేసిన ఆత్మాహుతి దాడిలో  ఆయన ప్రాణాలు కోల్పోయారు.

Comments

comments