హైదరాబాద్: శిరీష మర్డర్ కేసులో రాజీవ్ ప్రియురాలు తేజస్విని కీలకంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. తేజశ్విని, శిరీష మధ్య తీవ్ర వివాదాలు ఉన్నాయని తెలిపారు. పదిహేను రోజుల క్రితం శిరీషపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో తేజస్విని ఫిర్యాదు చేసింది. రెండు రోజుల్లోనే తాము వ్యవహారాన్ని పరిష్కరించుకుంటామంటూ తేజస్విని ఫిర్యాదును వెనక్కి తీసుకుంది. తేజస్విని స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. తనని కాదని తేజస్వినితో రాజీవ్ సన్నిహితంగా ఉండడాన్ని శిరీష జీర్ణించుకోలేకపోయింది. దీంతో రాజీవ్, శిరీష మధ్య గొడవ చినికి చినికి గాలివానలా మారింది. ఓ వివాహ ఫంక్షన్లో తేజస్వినితో రాజీవ్‌కు పరిచయం ఏర్పడింది. హైదరాబాద్‌లో తేజస్విని సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. శిరీష మృతి అనంతరం పరిణామాలతో తేజస్విని సొంతూరు విజయవాడకు వెళ్లిపోయింది.