Home తాజా వార్తలు రాహుల్ ఫెయిల్

రాహుల్ ఫెయిల్

Rajnath Singh against speech on rahul gandhi

దేశంలో కాంగ్రెస్‌కు భవిష్యత్ లేదు

స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసమే ఆ పార్టీ గగ్గోలు
దేశ రక్షణలో బిజెపి ఎప్పుడూ రాజీపడదు…వెనకడుగు వేయదు

నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్, సెల్ఫ్ లాస్ట్… ఇదే మా పార్టీ విధానం

యువ మహా అధివేశన్ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్

స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాఫెల్ విషయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఫెయిల్ అయ్యారని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వ్యాఖ్యానించారు. రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలు ఒప్పందం గత యుపిఏ (కాంగ్రెస్, మిత్రపక్షా ల కూటమి) ప్రభుత్వం కంటే కేంద్రంలో ని బిజెపి ప్రభుత్వం మరింత మంచి ఒప్పందం చేసిందన్నారు. దేశ రక్షణ విషయంలో బిజెపి ఎక్కడా రాజీ పడలేదని, ఎన్నడూ వెనకడుగు వేయదని స్పష్టం చేశారు. దేశంలో విశ్వసనీయత కలిగిన ఏకైక పార్టీ బిజెపి అని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ యుమమోర్చా (బిజెవైఎం) ఆధ్వర్యంలో శనివారం నగరంలోని పెరేడ్ గ్రౌండ్స్‌లో విజయ్‌లక్ష- 2019 పేరిట రెండు రోజుల యుమ మహా దివేశన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజ్‌నాథ్‌సింగ్ ప్రసంగిస్తూ, కాంగ్రెస్ పార్టీ తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసమే రాఫెల్‌పై రాజకీయం చేస్తోందని మండిపడ్డారు.

దేశంలో అస్థిత్వాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఎంత అరిచి గగ్గోలు పెట్టినా ప్రజలు విశ్వసించరన్నారు. రాహుల్‌గాంధీకి రాఫెల్ అంశం తప్ప మరోటి గుర్తుకురావడం లేదని ఎద్దేవాచేశారు. నేషన్ ఫస్ట్… పార్టీ నెక్స్, సెల్ఫ్ లాస్ట్ అనే విధానం, నినాదంతో బిజెపి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అందుకే నాలుగున్నర సంవత్సరాల్లో బిజెపి ప్రభుత్వానికి ఎలాంటి అవినీతి మరకలు అంటుకోలేదన్నారు. ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోవాలన్న ధ్యాసే తప్ప, దేశం ఏమైపోయినా కాంగ్రెస్ పార్టీకి పట్టదని ధ్వజమెత్తారు. అధికార దాహంతోనే భిన్న దృక్పథాలు కలిగిన పార్టీలతో కాంగ్రెస్ చెలిమిచేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీతో జతకట్టిన పార్టీలకు ఎప్పుడు భవిష్యత్ ఉండదన్నారు. ఒకప్పుడు దేశంలో బలంగా ఉన్న కమ్యూనిస్టు పార్టీ, కాంగ్రెస్‌తో చెలిమి చేసి ప్రస్తుతం ఒక రాష్ట్రానికే పరిమితమయిందని గుర్తుచేశారు. ఎన్ని పార్టీ లు ఏకమైనా మోదీ విజయాన్ని ఆపలేవన్నారు. కాంగ్రెస్‌తో వెళ్ళే పార్టీలు తరువాత ‘మీ టూ’ ఉద్యమం చే యాల్సి వస్తుందన్నారు. ఇందిరాగాంధీ హయాంలో పాకిస్థాన్‌తో యుద్దం జరిగినప్పుడు మన సైనికులు సాధించిన విజయంపై అప్పట్లో వాజ్‌పేయి అభినందించిన విషయాన్ని రాజ్‌నాథ్ సింగ్ గుర్తు చేశారు.

దేశ రక్షణ, సమగ్రత విషయంలో బిజెపికున్న విధేయత మరే పార్టీకీ లేదన్నారు. ప్రపంచంలో అత్యధిక వేగంగా ఆర్ధిక అభివృద్ధి చెందుతున్న దేశం ఒక్క భారత్ మాత్రమేనని అన్నారు. ఫ్రాన్స్‌ను కూడా వెనక్కినెట్టిందన్నారు. దేశం పట్ల ప్రేమ, స్వాభిమానం ఉన్న యువత బిజెవైఎం మాత్రమేనని అన్నారు. ఆంగ్లేయుల బుల్లెట్‌తో మరణించడం ఇష్టం లేక చంద్రశేఖర్ ఆజాద్ తనకు తానే కాల్చుకోగా, ఆప్రాపుల్లాఖాన్ చావును పెళ్ళాడుతున్నట్లు ప్రకటించిన మహానేతలన్నారు. భారత్‌ను విశ్వగురువుగా చేసే సంకల్పంతోనే అంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇందులో బిజెవైఎం అందరికంటే ముందు వరుసలో ఉండాలని కోరారు. మోడీకి సంపూర్ణమైన అధికారాన్ని కట్టబెట్టేందుకు ౩50 లోక్‌సభ సీట్లు గెలిచే వరకు కార్యకర్తలు నిద్రపోవద్దని హితవుపలికారు.

కాళేశ్వరానికి అన్ని విధాలుగా సహకరించాం : నితిన్ గడ్కరీ
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించిందన్నారు. సకాలంలవో అన్ని రకాల అనుమతులు మంజూరు చేసిందన్నారు. వాటర్‌గ్రిడ్, పవర్ గ్రిడ్, హైవే గ్రిడ్ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. అభివృద్ధిలో అన్ని రాష్ట్రాలను కేంద్రం సమానదృష్టితో చూస్తున్నదన్నారు. కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేస్తామని దక్షిణాది (ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు) రాష్ట్రాల్లో చివరి గ్రామం వరకు నీళ్ళు అందించి వాజ్‌పేయ్ కలలను సాకారం చేస్తామన్నారు. ఏపీని ఆదుకునేందుకు పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ.70వేల కోట్లు మంజూరు చేసిందన్నారు. రాత్రింబవళ్ళు ఈ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని తెలిపారు. అయినప్పటికీ ఈ ప్రాజెక్టుపై కొందరు ఆరోపణలు చేస్తుండడం సహేతుకం కాదన్నారు. సుపరిపాలన, అభివృద్ధి, జాతీయవాదం, అంత్యోదయ విధానంతో కేంద్రంలో పనిచేస్తోందన్నారు.

పాతికేళ్ళ వామపక్షాల ప్రభుత్వం కుప్పకూలింది : త్రిపుర సిఎం
ప్రధాని నరేంద్రమోడీ దెబ్బకు 25 సంవత్సరాల వామపక్షాల ప్రభుత్వం త్రిపురలో కుప్పకూలిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బిప్లబ్‌కుమార్ దేవ్ అన్నారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రాజకీయ వ్యూహాలు, మోడీ నేతృత్వంలో కేంద్రం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశంలోని అన్ని వర్గాల ప్రజలు కమలానికి దగ్గరయ్యేలా చేశాయన్నారు. తాను ఒక సాధారణ కార్యకర్త అయినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి వరించిందన్నారు. పనిచేసేవారికి పార్టీ గుర్తింపు లభిస్తుందని చెప్పడానికి ఇదొక నిదర్శమన్నారు. మోడీ, అమిత్‌షా మంత్రంతోనే త్రిపురాలో గెలిచిన సూత్రం అన్ని రాష్ట్రాలకూ వర్తిస్తోందన్నారు.

మోదీ మరోసారి ప్రధాని కావాలి : మహారాష్ట్ర సిఎం ఫడ్నవిస్
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 350 సీట్లతో మోడీ మరోసారి ప్రధాని కావాలని మహరాష్ట్ర సిఎం పఢ్నవిస్ అన్నా రు. యువమోర్చా ఆవశ్యకతను ప్రమోద్ మహాజన్ గుర్తించి పటిష్టం చేశారన్నారు. దేశంలో ప్రతీ పోలింగ్ బూత్ నుంచి ప్రేమతో ఓటింగ్ వేయించగల శక్తి యువమోర్చాకు ఉందని అన్నారు. మోడీ మరోసారి ప్రధాని కావడం బిజెపి కోసం కాదని, దేశం కోసమన్నారు. ప్రపంచంలో యువశక్తి ఉన్న ఏకైక దేశం భారతదేశమేనని వ్యాఖ్యానించారు.

పెట్రోల్ ధరలు కేంద్రంలో ఆధీనంలో ఉండవు : ధర్మేంధ్ర ప్రదాన్
పెట్రోల్, డీజిల్ ధరలు కేంద్రం ఆధీనంలో ఉండవని, ఉ త్పత్తి దేశాల మీద ఆధారపడి ఉంటుందని కేంద్రమం త్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. మన దగ్గర ఉత్తపత్తి లేదు కా బట్టి బయో ఎనర్జీ, సోలార్ ఎనర్జీలాంటి ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ సాగుతోందన్నారు. ధరలను నియంత్రించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందన్నారు. 60 ఏళ్ళలో కాంగ్రెస్ చేయలేని పనులను మోదీ కేవలం నాలుగున్నర సంవత్సరాలలలో చేసిచూపించిందన్నారు.

Rajnath Singh against speech on rahul gandhi

Telanagana Letest News