Home జాతీయ వార్తలు 90శాతం హామీలు అమలు చేశాం…

90శాతం హామీలు అమలు చేశాం…

Rajnath singh comments on ap issues

న్యూఢిల్లీ: విభజన హామీలను అమలు చేస్తూ వస్తున్నామని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. విభజన సమస్యలపై రాజ్యసభలో జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇప్పటికే 90శాతం విభజన హామీలను నెరవేర్చమని చెప్పారు. ఎపికి గత ప్రభుత్వం, తమ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉన్నామన్నారు. ప్రధాని పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతామని రాజ్ నాథ్ సింగ్ భరోసా ఇచ్చారు. అలాగే విద్యాసంస్థల విషయంలో తమ ప్రభుత్వానికి ఎటువంటి పక్షపాతం లేదని ఆయన పేర్కొన్నారు. ఎపిలో అధికారంలో బిజెపి ఉందా..?  మరొక పార్టీ అన్నది తమకు ముఖ్యం కాదని రాజ్ నాథ్ అన్నారు. కడప స్టీల్, బయ్యారం స్టీల్, విశాఖ రైల్వే జోన్ అంశాలను పరిశీలిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.