Search
Sunday 23 September 2018
  • :
  • :

ముందస్తు ఎన్నికలు ఉండవ్ : రాజ్‌నాథ్

Rajnath Singh Comments on Before Elections

ఢిల్లీ : షెడ్యూల్ ప్రకారమే లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తేల్చి చెప్పారు. ముందస్తు ఎన్నికలకు అవకాశమే లేదని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల మొత్తం ప్రక్రియ 2019, మే15లోపు పూర్తవుతుందన్నారు. డిసెంబర్‌లో నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో పాటు లోక్‌సభకు ఎన్నికలు నిర్వహించే౦ అవకాశం ఉందని ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో రాజ్‌నాథ్ సింగ్ పైవిధంగా స్పందించారు. జమిలి ఎన్నికల విషయంలో ఎన్నికల సంఘమే తుది నిర్ణయం తీసుకుంటుందని రాజ్‌నాథ్ తెలిపారు. జమిలి ఎన్నికలు సాధ్యమే అయినప్పటికీ, దానికి చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉందని, అన్ని రాజకీయ పార్టీలు అంగీకరిస్తేనే అది సాధ్యమని ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టం చేసింది.

Rajnath Singh Comments on Before Elections

Comments

comments