Search
Wednesday 21 November 2018
  • :
  • :

లోక్‌సభకు ముందస్తు ప్రసక్తే లేదు : రాజ్‌నాథ్ సింగ్

lok sabha does not have a preliminary election

న్యూఢిల్లీ : లోక్‌సభకు ముందస్తు ఎన్నికల ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దేశంలో సార్వత్రిక ఎన్నికలు నిర్ణీతంగా వచ్చే ఏడాదే జరుగుతాయి, అంతకుముందు వీటిని నిర్వహిం చే అవకాశం, తొందర ఏదీ లేదని ఆయన తెలిపారు. షెడ్యూల్ కన్నా ముందు ఎన్నిక ల ఆలోచన లేదని, మొత్తం ఎన్నికల ప్రక్రి య 2019 మే 15వ తేదీ నాటికి పూర్తి అవుతుందని ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలల్లో ఎన్నికలు ఉంటాయని వివరించారు. లోక్‌సభ, అసెంబ్లీలకు ఏకకాల ఎన్నికల జమిలి ప్రక్రియను వినూత్నంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం యత్నిస్తున్న తరుణంలో హోం మంత్రి స్పందన వెలువడింది. ఈ ఏడాది డిసెంబర్ వచ్చే ఏడాది జనవరితో మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికలతో కలిపి లోక్‌సభ ఎన్నికలను ముందుకు జరిపి నిర్వహిస్తారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ విధంగా లోక్‌సభ ఎన్నికలను ముందుకు జరపడం లేదా, జమిలి ఎన్నికల అవకాశాల గురించి ప్రస్తావిస్తూ ఈ అంశంపై నిర్ణయం తీసుకోవల్సింది ఎన్నికల సంఘం అని రాజ్‌నాథ్ సింగ్ తేల్చిచెప్పారు. జమిలి నిర్వహణ అవకాశాలను పరిశీలించాలని ప్రధాని మోడీ కోరారని రాజ్‌నాథ్ సింగ్ గుర్తు చేశారు. ఎన్నికల ప్రక్రియలలోని సాధ్యాసాధ్యాలను ఎన్నికల సంఘం పరిశీలించుకోవల్సి ఉందని రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు.

Comments

comments