Home తాజా వార్తలు అమర జవాన్లకు నివాళులు అర్పించిన రాజ్‌నాథ్‌సింగ్

అమర జవాన్లకు నివాళులు అర్పించిన రాజ్‌నాథ్‌సింగ్

RAJNATH

రాయ్‌పూర్ : చత్తీస్‌గఢ్‌లోని సుకమా జిల్లాలో సిఆర్‌పిఎఫ్ జవాన్లపై సోమవారం మధ్యాహ్నం మావోయిస్టులు దాడి చేసి 25 మంది జవాన్లను పొట్టబెట్టుకోవడంపై   కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనలో నిందితులను వదలబోమని ఆయన హెచ్చరించారు. ఇది పాశవిక హత్య అని ఆయన అన్నారు. మావోల దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు ఆయన మంగళవారం నివాళులు అర్పించారు. మంగళవారం ఆయన ఛత్తీస్‌గఢ్‌కు వచ్చి మనా క్యాంపులో ఉన్న జవాన్ల మృతదేహాల వద్ద పుష్ప గుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. ఇది మావోయిస్టులు నిరాశతో చేసిన క్రురమైన హత్యగా ఆయన అభివర్ణించారు. గిరిజనులను పావులుగా వాడుకొని మావోయిలు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. అనంతరం ఛత్తీస్‌గఢ్ సిఎం రమణ్‌సింగ్‌తో ఆయన భేటీ అయ్యారు. అక్కడి నుంచి రామకృష్ణ కేర్ ఆస్పత్రికి వెళ్లి మావోల దాడిలో గాయపడివన జవాన్లను పరామర్శించారు.