Home జాతీయ వార్తలు బాలీవుడ్ హాస్య నటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు ఆరు నెలల జైలు శిక్ష

బాలీవుడ్ హాస్య నటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు ఆరు నెలల జైలు శిక్ష

Rajpal Yadav sentenced to six months in jail
Rajpal Yadav sentenced to six months in jail

ముంబయి:  ప్రముఖ బాలీవుడ్ హాస్య నటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు ఆరు నెలల జైలు శిక్ష పడింది. రూ. 5 కోట్లు రుణం తీసుకొని, తిరిగి చెల్లించని కేసులో ఆయన దోషిగా దిల్లీలోని కర్‌కర్‌డుమా కోర్టు  పది రోజుల క్రితం తీర్పు ఇచ్చింది. ఈ మేరకు ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తున్నట్లు సోమవారం న్యాయస్థానం పేర్కొంది. అనంతరం యాదవ్ బెయిలుపై బయటకి వచ్చారు. 2010లో యాదవ్ దిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఎంజీ అగర్వాల్ నుంచి రూ.5 కోట్లు తీసుకున్నారు. తన తొలి హిందీ చిత్రం అతా పతా లాపతా  కోసం ఈ అప్పు చేశారు. తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించకపోవడంతో వ్యాపారవేత్త కేసు పెట్టారు.  ఈ నేపథ్యంలో 2013 లో యాదవ్ పది రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీలో కూడా ఉన్నారు.  యాదవ్ పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు.