Search
Friday 21 September 2018
  • :
  • :

రాజుగాడికి ‘క్లెప్టోమేనియా’…(టీజర్)

Rajugadu

హైదరాబాద్:  ‘క్లెప్టోమేనియా’ అని అదేదో కొత్త జబ్బట. తనకు తెలియకుండానే తను దొంగతనాలు చేసేస్తున్నాడు’ అంటూ యువ కథానాయకుడు రాజ్‌తరుణ్‌ ఓ విభిన్న కథాంశంతో తన కొత్త చిత్రం ‘రాజుగాడు’ను తీసుకువస్తున్నాడు. ఉగాది సందర్భంగా ఈ మూవీ టీజర్ ను ఆదివారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. టీజర్ లో రాజ్‌తరుణ్‌ ఓ వింత జబ్బుతో బాధపడుతూ కనిపించారు. ఏ వస్తువు కనిపించినా.. తనకు తెలియకుండానే దాన్ని దొంగతనం చేసేస్తున్నారు. సంజయ్‌ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. అమైరా దస్తర్‌ హీరోయిన్ గా నటిస్తుంది. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ మరో కీలక పాత్రను పోషిస్తున్నారు. గోపీసుందర్‌ స్వరాలు అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మే 11న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

Rajugadu Teaser Out Now.

Comments

comments