Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

9న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక

Rajya Sabha deputy chairman election on 9th of this month
న్యూఢిల్లీ: ఆగష్ట్ 9న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మొత్తం 245 మంది సభ్యులు ఓటింగ్ లో పాల్గొననున్నారు. ఈ ఎన్నికలో గెలవలంటే 123 మంది సభ్యుల మద్దతు కావాలి. 14 మంది అన్నాడిఎంకె సభ్యులతో కలిసి ఎన్ డిఎ బలం 106 కాగా, ఆరుగురు టిడిపి సభ్యులతో కలిసి ప్రతిపక్షాల బలం 117. బిజెడి, టిఆర్ఎస్ ను తమవైపు మళ్లించుకోవడానికి బిజెపి కసరత్తు చేస్తుంది. ఎన్ డిఎ నుంచి నరేష్ గుజ్రాల్ ను నిలబెట్టాలని బిజెపి భావిస్తోంది. అయితే 8వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్ కు తుదిగడువుగా ఎన్నికల కమీషన్ పేర్కొంది.

Comments

comments