Search
Thursday 20 September 2018
  • :
  • :

సెహ్వాగ్‌ను కలిసిన కేంద్ర మంత్రి రాథోడ్, ఢిల్లీ చీఫ్

Swevag

న్యూఢిల్లీ: కేంద్ర క్రీడల శాఖ మంత్రి రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్, బిజెపి ఢిల్లీ అధ్యక్షుడు మనోజ్ తివారీ గురువారం భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ నివాసానికి వెళ్లారు. సంపర్క్ ఫర్ సమర్ధన్ కార్యక్రమంలో భాగంగా దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను కలిసి బిజెపి ప్రభుత్వం సాధించిన విజయాల గురించి వివరిస్తున్నసంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలోని గత నాలుగేండ్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలతో రూపొందించిన పుస్తకాన్ని వీరిద్దరూ సెహ్వాగ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలపై చర్చలు జరిపారు. తిరుగు ప్రయాణంలో రాథోడ్, తివారీ ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ప్రయాణికులు ఆయనతో సెల్ఫీలు దిగారు. ప్రస్తుతం ఢిల్లీ వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.

Comments

comments