Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

పర్యావరణానికీ రాఖీ

Rakhi is the key to the hand to be happy relationship

అన్నాచెల్లెళ్ల అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్. ప్రియమైన వారు ఎల్లప్పుడూ క్షేమంగా, సంతోషంగా ఉండాలని కోరుతూ చేతికి కట్టే బంధనమే రాఖీ. అదేవిధంగా రక్షను కట్టించుకున్న అన్నలు ఆనందంతో అక్కాచెల్లెళ్లకు విలువైన కానుకలు ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. సోదరులు దగ్గర లేకున్నా సరే పోస్ట్‌ద్వారా అయినా రాఖీను పంపించి వారి ప్రేమను పంచుకుంటారు ఆడపడుచులు.  ఇదంతా బాగానే ఉంది. ఆ రోజు కట్టించుకున రాఖీని చాలా భద్రంగా చూసుకుంటారు. తర్వాత తీసి పక్కన పెడతారు. లేదా భద్రపరుచుకుంటారు.  ఎవరైనా చేసేదింతే.  రాఖీలు కొనుగోలు చేసేటపుడు కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది. పర్యావరణానికి ముప్పు వాటిల్లితే కలిగే పరిణామాలను ఇప్పటికే మనం చూస్తున్నాం. అనుభవిస్తున్నాం కూడా.  మరి కొనే రాఖీలు కూడా పర్యావరణానికి హాని కలిగించకుండా ఉంటే ఎంత బాగుంటుందో కదా! ఇప్పుడు మార్కెట్లో ఎకో ఫ్రెండ్లీ రాఖీలు పర్యావరణ ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి.  ఆన్‌లైన్‌లో దొరికే ఎకో ఫ్రెండ్లీ రాఖీలను కొన్నింటిని చూద్దాం…

ఫొటో రాఖీలు: లాకెట్ మీద సోదరులు లేదంటే ప్రేమకు ప్రతీకగా నిలిచిన ఫొటోలను ముద్రించి రాఖీలా తయారు చేస్తున్నారు. తరువాత ఆ లాకెట్‌ని కీ చెయిన్‌గానో లేదా వాల్ మ్యాగ్నెట్‌లానూ వాడుకోవచ్చు. ఇవి కావాలనుకునేవారు ఆన్‌లైన్‌ద్వారా ఇంటికి తెప్పించుకోవచ్చు.

గింజల రాఖీలు… ఈ సహజసిద్ధమైన రాఖీలలో మొక్కజొన్న విత్తనాల రాఖీలని ఎక్కువ ఇష్టపడుతునామ్నరు. రాఖీల్లో మొక్కజొన్న గింజలు చొప్పించి పెడతారు. గింజలు ఎండబెట్టి మొక్కలుగా నాటుకోవటానికి ఉపయోగపడతాయి. ఈ గింజలు వేస్తే మొక్కగా ఎలా పెరుగుతుందో అదేవిధంగా తోబుట్టువు బంధం కూడా అలా పెరుగుతుందనే నమ్మకం కలిగించేలా రూపొందిస్తున్నారు డిజైనర్లు. ఈ చెట్లు ఎప్పటికీ రక్షాబంధన్‌కి గుర్తుగా ఉంటాయని చెబుతున్నారు. ఇవి ఓ కిట్‌రూపంలో లభిస్తాయి. వీటి విలువ రూ.300లు. దీంట్లో కుంకుమ భరిణె, ఒక పేపరు, పెన్సిల్ ఉంటాయి. ఈ కిట్‌లో కూరగాయల గింజలు, పువ్వుల చెట్ల గింజలు కూడా లభ్యమవుతాయి. రాఖీ కట్టే పోగులు కూడా పర్యావరణ హితమైన కాగితంతో చేసినవే.
టెర్రకోట రాఖీలు: టెర్రకోట రాఖీలు వివిధ రకాల గింజలు, పూసల ఆకారంలో అందంగా ఉంటాయి. వాటికి మెటల్‌తో, కాటన్‌తో తాడును ఉపయోగించి తయారు చేస్తారు. వీటిని సులభంగా రీసైకిల్ చేయటానికి వీలవుతుంది. ఇవి పర్యావరణానికి నష్టం జరుగకుండా కాపాడతాయి. తులసి, బంతి విత్తనాలతో కూడా రాఖీలు తయారు చేస్తున్నారు. వాటిని ప్యాకింగ్ చేయటానికి కూడా ఎకో ఫ్రెండ్లీ పద్ధతినే ఉపయోగిస్తున్నారు. చాలా మంది ఫేస్‌బుక్‌లో ఆర్డర్లద్వారా వాటిని తెప్పించుకుంటున్నారు. వాటిని పండుగ అయిన తరువాత పడేయకుండా విత్తనాలు నాటి చెట్లుగా పెంచుకోవచ్చు.

రాఖీని తినేయొచ్చు: సిటీలో బేకరీల్లో లభించే రాఖీలివి. కప్‌కేక్స్‌తోనూ, చాక్‌లెట్స్‌తో కూడి వస్తున్నాయి. అనేక రకాల రంగుల్లో రుచుల్లో కనిపించే ఈ రాఖీలు ఇప్పుడు హాట్‌కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. చిన్నపిల్లలు వీటిని ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

శృతిబంధన్ : గత రెండేళ్లుగా ఆదిలాబాద్ లోని కళా ఆశ్రమం నుండి ‘బాంబూ రాఖీలు’ ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ప్రతి సంవత్సరం తెలంగాణాలో వీటి అమ్మకాలు జరుగుతున్నాయి. వీటిని ‘శృతి బంధన్’ అంటారు. ఇవి మహారాష్ట్రలోని పల్లెల్లో ప్రత్యేకించి ఈ చెక్క నుపయోగించి ఈ రాఖీలను తయారు చేస్తారు.

వెండి రాఖీలు: వెండి కోటింగ్ చేసి మధ్యలో దేవతామూర్తుల బొమ్మలతో పెట్టిన ముత్యాల రాఖీలు కూడా ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్నాయి. వాటిని ఈ రాఖీ పండుగ అయిన తరువాత పూజగదిలో కూడా పెట్టుకోవచ్చు. ఇవేకాకుండా ఊలుతో తయారుచేసిన రాఖీలు పర్యావరణానికి ఏమాత్రం కలిగించవు.

Comments

comments