Home దునియా దయ్యం బ్రిడ్జి !

దయ్యం బ్రిడ్జి !

Rakotzbrucke Devil's Bridgeదయ్యం భవనాలు… దయ్యం చెట్ల గురించి విని ఉంటాం. కానీ దయ్యం బ్రిడ్జి గురించి వినడం ఇదే మొదటిసారేమో! అదే ఈ ఫొటోలో ఉన్న బ్రిడ్జి. ఇది జర్మనీలో ఉంది. దీన్ని స్థానికంగా దయ్యం బ్రిడ్జి అని అంటారు. 1860 స్థానిక రాజు నిర్మించిన ఈ బ్రిడ్జి ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఈ బ్రిడ్జిపై నుంచి మనుషులు నడవడానికి వీలుగా దారిని కూడా నిర్మించారు. ఇటీవలి వరకు దీని మీది నుంచి పర్యాటకులు నడిచేవారు. అయితే, ఈ మధ్యే దీనిపైకి మనుషులెవరినీ అనుమతించడంలేదు. కట్టడాన్ని పరిరక్షించే చర్యలలో భాగంగా ఈ నిషేధం విధించారు. అర్థచంద్రాకారంలో ఉన్న ఈ బ్రిడ్జి… నీటిలో పడిన ప్రతిబింబంతో వృత్తాకా రంలో కనిపిస్తూ పర్యాట కులను అమితంగా ఆకట్టుకుంటోంది. దీనిని అక్కడివారు రకోట్జ్ బ్రూక్ అని పిలుస్తారు.

Rakotzbrucke Devils Bridge in Germany