Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

లండన్‌లో నెల రోజుల పాటు

rakul

కాళ్ల కింద చక్రాలతో పుట్టిందా ఏంటి అనేంతగా ఒక్క చోట ఉండకుండా అటూ ఇటూ తిరుగుతూనే ఉంటుంది రకుల్‌ప్రీత్ సింగ్. ఈ భామ ఓ రోజు చెన్నైలో ఉంటే మరో రోజు హైదరాబాద్‌లో ప్రత్యక్షమవుతుంది. ఇక్కడుందా అనుకునేలోపు ముంబయికి వెళ్లిపోతుంది. ఇవన్నీ కాదంటే హాయిగా విదేశాలకు వెళ్లి హాలిడే టూర్‌ను ఎంజాయ్ చేస్తుంది. ఇంత బిజీగా ఉండే రకుల్ ఒక్క చోట ఎక్కువ రోజులు ఉండడమంటే విశేషమే. ఇప్పుడు ఇదే జరుగుతోంది. ఆమె ఓ హిందీ సినిమా కోసం లండన్‌కు వెళ్లింది. నెల రోజుల పాటు అక్కడే ఉండబోతోంది. అజయ్‌దేవ్‌గణ్ హీరోగా లవ్ రంజన్ దర్శకత్వంలో తెరకెక్కే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో రకుల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం షెడ్యూల్ నెల రోజుల పాటు లండన్‌లో జరుగనుంది. అందుకే నెల రోజులు అక్కడే ఉండానంటూ ట్విట్టర్‌లో తెలియజేసింది రకుల్. ఈ చిత్రంతో పాటు తమిళ్‌లో శివకార్తికేయన్, సూర్య, కార్తి సినిమాల్లో నటిస్తోంది ఈ బ్యూటీ. లండన్ నుంచి వచ్చేవరకు ఈ సినిమాలన్నింటికీ రకుల్ బ్రేక్ ఇచ్చినట్లే.

Comments

comments