Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

నాగచైతన్యకు జోడీగా రకుల్

rakulటాలీవుడ్‌లో తక్కువ కాలంలో టాప్ హీరోయిన్‌గా రాణించిన బ్యూటీ రకుల్‌ప్రీత్ సింగ్. పలువురు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ ఈ భామ దూసుకుపోతోంది. ఇదే ఊపులో అక్కినేని నాగచైతన్యతో ఓ సినిమా చేసేందుకు సిద్ధమవుతోంది. ఓ ప్రముఖ దర్శకుడు తెరకెక్కించే ఈ సినిమాలో రకుల్ హీరోయిన్‌గా ఎంపికైంది. ఇక నాగచైతన్య… గౌతమ్ మీనన్ దర్శకత్వంలోని ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాను పూర్తి చేసుకోగా, ‘ప్రేమమ్’ రీమేక్ ‘మజ్ను’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ‘మజ్ను’లో శృతిహాసన్‌తో రొమాన్స్ చేస్తున్నాడు చైతూ. ఈ సినిమా పూర్తయిన తర్వాతే తన తదుపరి సినిమా షూటింగ్‌లో పాల్గొంటాడు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించే రకుల్‌ప్రీత్ సింగ్… నాగచైతన్య సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Comments

comments