Search
Wednesday 26 September 2018
  • :
  • :

జయలలిత పాత్రలో…

Rakul-preet-singh

తమిళ సినీ, రాజకీయ రంగాల్లో చెరగని ముద్ర వేసిన వ్యక్తి ఎంజిఆర్. అన్నాడిఎంకె పార్టీ వ్యవస్థాపకుడు ఆయన. 1977 నుంచి 1987 వరకు తమిళనాడు సిఎంగా పనిచేశారు. తెలుగులో ఎన్టీఆర్‌లాగానే ఎంజిఆర్ సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టి సక్సెస్ అయ్యాడు. అయితే ప్రస్తుతం ఎంజిఆర్ జీవిత చరిత్ర ఆధారంగా సూర్య ‘ఎన్‌జికె’ మూవీని తెరకెక్కిస్తున్నాడని తెలిసింది. ఈ సినిమాలో ఎంజిఆర్ పాత్రలో సూర్య, ఆయన భార్యగా సాయిపల్లవి నటిస్తోందని సమాచారం. ఇక ఎంజిఆర్‌కు సన్నిహితురాలైన మాజీ ముఖ్యమంత్రి జయలలిత పాత్ర ఈ సినిమాలో చాలా కీలకం. అన్నాడిఎంకె పార్టీని ఉన్నత స్థాయికి చేర్చిన  ఆమె తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎంతో పేరుతెచ్చుకుంది. ఇక ‘ఎన్‌జికె’ చిత్రంలో జయలలిత పాత్రలో టాప్ హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్‌ను తీసుకున్నట్టు తెలిసింది. ఈ పాత్రను ఎంతో ఛాలెంజింగ్‌గా తీసుకొని రకుల్   సినిమా చేస్తోందట. ప్రస్తుతం తమిళంలో వరుసగా సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ ఎంజిఆర్ బయోపిక్ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకుందట.

Comments

comments