Home సినిమా ఘాటుగా స్పందించిన రకుల్

ఘాటుగా స్పందించిన రకుల్

Rakul Preet Singh fires back at a netizen 
రొటీన్‌గా కనిపిస్తే ఎవరు చూస్తారని కొంచెం డిఫరెంట్‌గా కనిపించేందుకు హీరోయిన్లు తాపత్రయపడుతున్నారు. ఈ విషయంలో బాలీవుడ్ ముద్దుగుమ్మలే కాదు టాలీవుడ్ ముద్దుగుమ్మలు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. అప్పట్లో బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీకపూర్ షార్ట్‌లెంత్ నిక్కరులో కనిపిస్తే అది హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పుడు సీనియర్ నాయిక రకుల్‌ప్రీత్ సింగ్ అదే తరహాలో స్పీడు చూపించింది. తాజాగా రకుల్ డెనిమ్ లుక్‌లో దర్శనమిచ్చింది. చిట్టి పొట్టి బ్లూ డెనిమ్ నిక్కరులో రకుల్ కారు దిగుతున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ లుక్‌పై నెటిజన్లు కొందరు ఘాటుగా స్పందించారు. ఓ నెటిజన్ అయితే బూతు కామెంట్ చేశాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రకుల్ తనదైన శైలిలో ఘాటుగా సమాధానమిచ్చింది. “మీ అమ్మ నీకు ఇలాంటివే నేర్పిస్తున్నారా? కొన్ని మంచి విషయాలను కూడా నేర్పించమని అడుగు. నీలాంటి వాళ్లు ఉన్నంతవరకు ఆడవాళ్లకు రక్షణే ఉండదు”అని రకుల్ పేర్కొంది. అయితే తల్లిని అనడం సబబు కాదని… రకుల్ ఈవిధంగా మాట్లాడి మరింత దిగజారిపోయారని కొందరు నెటిజన్లు చురకలంటిస్తున్నారు.

Rakul Preet Singh fires back at a netizen