Home తాజా వార్తలు ఫిట్‌నెస్ పాఠాలు

ఫిట్‌నెస్ పాఠాలు

Rakul Preet Singhఫిట్‌నెస్ అంటే బక్కచిక్కిపోవడం కాదు… శరీరంలో పేరుకుపోయిన అనవసర వ్యర్థాల్ని తొలగించుకోవడమంటూ చిన్నపాటి క్లాస్ తీసుకుంది రకుల్‌ప్రీత్ సింగ్. ఫిట్‌నెస్‌కు రకుల్ పెట్టింది పేరు. తనలా ఫిట్‌నెస్ పాఠాలు నేర్చుకోవాలనుకునే అమ్మాయిల కోసం ఆమె పలు చోట్ల ఫిట్‌నెస్ సెంటర్లను నడుపుతోంది. అయితే ఈమధ్య రకుల్‌పై కొన్ని గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. వర్కవుట్స్ చేసి బక్కచిక్కిపోయిన రకుల్‌ను ‘మన్మథుడు 2’ కోసం బరువు పెరగాలనీ, కాస్త బొద్దుగా కనిపించాలని నాగార్జున సూచించాడని సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ భామ మాత్రం ఫిట్‌నెస్ పేరు చెప్పి ఇంకా వర్కవుట్స్ చేస్తుండడంతో నాగార్జున రకుల్‌పై కోపంగా ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే అదేం లేదనీ… అవన్నీ కేవలం పుకార్లేనని దర్శకుడు రాహుల్ రవీంద్రన్ క్లారిటీ ఇచ్చాడు. సినిమా ప్రారంభమైనప్పటి నుండి రకుల్ షూటింగ్‌లో పాల్గొంటోందని ఆయన చెప్పాడు. అయినా కూడా ఈ రూమర్స్ ఆగకపోవడంతో తాజాగా రకుల్ ఫిట్‌నెస్‌పై ట్వీట్ చేసింది. తనపై జరుగుతున్న దుష్ప్రచారానికి ఈ భామ ఈవిధంగా కౌంటర్ ఇచ్చిందనుకోవాలి.

Rakul Preet Singh Gym Workouts