మారుతున్న ట్రెండ్ మేరకు ప్రస్తుతం కథానాయికలు సైతం గ్లామర్ పాత్రల కంటే నటనకు ఆస్కారం ఉన్న పాత్రలకే మొగ్గు చూపిస్తున్నారు. ఇటీవల ‘మహానటి’లో అద్భుతంగా నటించిన కీర్తిసురేష్ సైతం తనకు డీగ్లామర్ రోల్స్ అంటే ఇష్టమని ప్రకటించింది. ఇప్పుడు అదే బాటలో కొత్త పంథా ఆలోచనలతో ఇతర నాయికలు ముందుకెళ్తున్నారు. అమ్మ జయలలిత పాత్రలో నటించేందుకు నిత్యామీనన్ సంతకం చేసిందని తెలిసింది. ఇప్పుడు రకుల్‌ప్రీత్ సింగ్ అదే బాటలో నడుస్తోంది. ఈ భామకు ఓ గొప్ప అవకాశం దక్కింది. ఆమె రెగ్యులర్ మసాలా సినిమాలో కాకుండా స్పేస్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీకి సంతం చేసింది. శివకార్తికేయన్ కథానాయకుడిగా చేస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. ఈ స్పేస్ మూవీని ఎంతో ఛాలెంజింగ్ తెరకెక్కిస్తున్నారట. దీనితో పాటు తమిళంలో రెండు సినిమాలు, హిందీలో రెండు భారీ చిత్రాలు చేస్తోంది రకుల్‌ప్రీత్ సింగ్.