Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

సైలెంట్‌గా పూర్తిచేస్తున్నారు

Ram Charan-Boyapati Srinu upcoming film

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగస్థలం’తో రామ్‌చరణ్ బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఏకంగా రూ.125 కోట్ల షేర్‌ను వసూలు చేయడం విశేషం. అంతటి భారీ వసూళ్లను రాబట్టిన చిత్రం తర్వాత బోయపాటి దర్శకత్వంలో  రామ్‌చరణ్ చేస్తున్న సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  బోయపాటి ఈ చిత్రాన్ని హై ఎనర్జిటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు. ‘జయ జానకి నాయక’ వంటి భారీ విజయం తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. ఈ సినిమా అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ చిత్రానికి సంబంధించిన చిన్న విషయాన్ని కూడా బోయపాటి బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఇప్పటివరకు చరణ్ లుక్ కానీ, సినిమాకు సంబంధించిన విషయం కానీ లీక్ కాలేదు. టైటిల్ విషయంలో కూడా ఎలాంటి సమాచారం లేదు. సినిమాకు హైప్ తీసుకురావడం సులభమే కానీ ఆ హైప్‌ను చేరుకోవడం కష్టం. అందుకే ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటున్నారు ఫిల్మ్‌మేకర్స్. సినిమాను సైలెంట్‌గా పూర్తిచేసి విడుదలకు ముందు హడావిడి చేయాలని బోయపాటి నిర్ణయించుకున్నట్లు తెలిసింది. సెప్టెంబర్ 2న పవన్ పుట్టిన రోజు సందర్భంగా చరణ్  లుక్‌ను విడుదల చేస్తారని తెలిసింది. వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమా ‘రంగస్థలం’ స్థాయి విజయాన్ని దక్కించుకుంటుందా అంటూ మెగా అభిమానుల్లో చర్చ జరుగుతోంది.

Comments

comments