Home తాజా వార్తలు ఆ రోజునే చరణ్ సినిమా ఫస్ట్‌లుక్

ఆ రోజునే చరణ్ సినిమా ఫస్ట్‌లుక్

RamCharan-and-Pawan-Kalyan

మెగా హీరోల బర్త్‌డేలు వస్తున్నాయి అంటే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా చిరంజీవి, పవన్‌కళ్యాణ్, రామ్‌చరణ్, అల్లు అర్జున్‌ల బర్త్‌డే ఎప్పుడు వస్తుందా అని అభిమానులు నిరీక్షిస్తుంటారు. పుట్టిన రోజున మెగా హీరోల సినిమా ఫస్ట్‌లుక్ కానీ, టీజర్ లేదంటే ట్రైలర్… ఇలా ఏదైనా విడుదలయ్యే అవకాశం ఉంటుందని అభిమానులు ఆశ పడతారు. అభిమానులను నిరాశపరచకుండా మెగా హీరోలు తన బర్త్‌డే సందర్భంగా తమ సినిమాలకు సంబంధించిన పోస్టర్లు, టీజర్లను విడుదల చేస్తూనే ఉంటారు. ఇటీవల చిరంజీవి బర్త్‌డే సందర్భంగా ‘సైరా’ టీజర్‌ను విడుదల చేయడం జరిగింది. ఆరోజున బోయపాటి దర్శకత్వంలో రామ్‌చరణ్ నటిస్తున్న మూవీలోని స్టిల్‌ను విడుదల చేయాలని మొదట భావించారు. కానీ అలా జరుగలేదు. అయితే సెప్టెంబర్ 2న పవన్‌కళ్యాణ్ పుట్టిన రోజున చరణ్ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తారని తెలిసింది. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ సినిమాలోని ఒక స్టిల్‌ను విడుదల చేసేందుకు చరణ్ సిద్ధమయ్యాడు. సెప్టెంబర్ 2 వరకు టైటిల్‌పై కూడా ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. నిర్ణయం జరిగిపోతే టైటిల్‌తోనే పోస్టర్‌ను విడుదల చేసే అవకాశం ఉందని తెలిసింది. అదే రోజున వరుణ్‌తేజ్ కొత్త మూవీ పోస్టర్‌ను కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం వరుణ్ ‘అంతరిక్షం’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు.