Search
Tuesday 20 November 2018
  • :
  • :

జనసేన తరపున ప్రచారం : రామ్ చరణ్

Ram Charan Comments on 2019 Elections

హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున ప్రచారం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు ప్రముఖ హీరో రామ్ చరణ్ తేజ తెలిపారు. ప్రజా రాజ్యం పార్టీని స్థాపించినప్పుడే తాను ప్రచారం చేయాలనుకున్నానని, అయితే తన బాబాయ్, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ వద్దన్నారని ఆయన చెప్పారు. పవన్ జనసేన పార్టీని స్థాపించి ప్రజల కోసం కష్టపడుతున్నారని పేర్కొన్నారు. పవన్ అనుమతి ఇస్తే వచ్చే ఎన్నికల్లో జన సేన తరపున ప్రచారం చేస్తానని ఆయన ప్రకటించారు. రామ్ చరణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రామ్ చరణ్ వ్యాఖ్యలపై పవన్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న సినిమాతో బిజీగా ఉన్నారు.

Ram Charan Comments on 2019 Elections

Comments

comments