Search
Friday 21 September 2018
  • :
  • :

రాంచరణ్ మూవీకి క్లాసిక్ టైటిల్…

Rangasthalam

హైదరాబాద్: టాలీవుడ్‌లో తనదైనశైలిలో కొత్తరకం ప్రేమకథలను పరిచయం చేస్తూ, డిఫరెంట్ స్క్రీన్‌ప్లే, కథ కథనాలతో ఆకట్టుకునే టాలెంటెడ్ దర్శకుడు సుకుమార్. ప్రస్తుతం సుక్కు, రామ్‌చరణ్ కాంబినేషన్‌లో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా మూవీ టైటిల్‌తో కూడిన పోస్టర్ చిత్ర యూనిట్ విడుదల చేసింది.

మూవీ పేరును ‘రంగస్థలం 1985’గా నిర్ణయించారు. రామ్‌చరణ్ తొలిసారి పక్కా పల్లేటూరి అబ్బాయి పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో సమంత, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాక్‌స్టార్ దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రీమూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

Comments

comments