Search
Saturday 22 September 2018
  • :
  • :

అచ్చమైన పల్లెటూరి పిల్లాడిలా రాంచరణ్

Ram-Charan-New-Poster-1

ధృవ సినిమా సక్సెస్‌తో మరోసారి మెగాపవర్‌స్టార్ రాంచరణ్ తిరిగి ఫాంలోకి వచ్చాడు. రోటీన్ కథలు కాకుండా డిఫరెంట్ జోనర్‌లలో సినిమాలకు సైన్ చేస్తున్నాడు చెర్రీ. కాగా నాన్నకు ప్రేమతో సక్సెస్ తర్వాత సుకుమార్ చెర్రీతో ఓ సినిమాను చేసేందుకు సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇన్నాళ్లుగా ఎటువంటి సమాచారం తెలియలేదు. అయితే సోమవారం సుకుమార్ దర్శకత్వం తెరకెక్కుతున్న రాంచరణ్ 11వ సినిమా షూటింగ్ ప్రారంభమైది. ఈ సందర్భంగా ఈ చిత్రం స్నీక్ పీక్ పోస్టర్‌ను చరణ్ విడుదల చేశాడు. పూర్తిగా పల్లెటూరి వాతావరణంలో చరణ్ ఉన్న ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్‌మీడియలో హల్‌చల్ చేస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్‌గా నటిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Comments

comments