Home ఆంధ్రప్రదేశ్ వార్తలు పవన్ కు మద్దతుగా రామ్ చరణ్ ప్రచారం…

పవన్ కు మద్దతుగా రామ్ చరణ్ ప్రచారం…

Pawan Kalyan

అమరావతి:జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుక్రవారం విజయనగరం పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్నాక డీహైడ్రేషన్‌తో అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. శనివారం సాయంత్రానికి పవన్ కోలుకున్నారు.అయితే గుంటూరు జిల్లా తెనాలిలో ఇవాళ రాత్రి నిర్వహించనున్న ప్రచార సభకు జనసేన పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. సినీనటుడు రామ్‌ చరణ్‌ కూడా పవన్‌కు మద్దతుగా రెండు రోజుల పాటు ప్రచారంలో పాల్గొననున్నారు. కొద్దిసేపట్లో  రామ్ చరణ్ విజయవాడ చేరుకోనున్నారు. అనంతరం బాబాయ్‌ పవన్ తో కలిసి తెనాలి ప్రచార సభలో పాల్గొననున్నట్లు సమాచారం.

Ram Charan Supports to Pawan Kalyan Janasena Party