Home సినిమా నవంబర్‌లో రామ్‌గోపాల్‌వర్మ ‘ఎటాక్’

నవంబర్‌లో రామ్‌గోపాల్‌వర్మ ‘ఎటాక్’

Attackమంచు మనోజ్, సురభి జంటగా సికె ఎంట ర్‌టైన్‌మెంట్స్, శ్రీ శుభశ్వేత ఫిల్మ్ పతాకంపై సి.కల్యాణ్ నిర్మిస్తున్న చిత్రం ‘ఎటాక్’. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి శ్వేతలానా, వరుణ్, తేజ, సివి రావు నిర్మాతలు. ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ఈ సందర్భంగా రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ “ప్రేక్షకు లకు నచ్చే సినిమాలు చేయాలని సి.కల్యాన్ నాతో ఈ సినిమా చేయించారు. నేను క్యారెక్టర్స్‌ను బాగా నమ్ము తాను. మనోజ్ మసాలా హీరో అయినా సినిమాలో చాలా రియ లిస్టిక్‌గా నటించాడు”అని అన్నారు. సి.కల్యాణ్ మాట్లాడుతూ “సినిమాలో క్యారెక్టర్‌కి మనోజ్ సరిపోతాడని భావించి అతన్ని తీసుకున్నాం. సినిమా మొదటి కాపీ చూసినప్పుడు ఏదో మిస్ అయిందనే ఫీలింగ్‌తో మళ్లీ ఓ వారం రోజుల పాటు షూట్ చేశాం. అంజి ఫొటోగ్రఫీ అద్భు తంగా ఉంటుంది. ఈ సినిమా తో ఖచ్చితంగా బెస్ట్ ఫొటోగ్రఫీ అవార్డు సొంతం చేసుకుం టాడు. నవంబర్ మూడవ వారంలో సినిమాను రిలీజ్ చేయ డానికి ప్లాన్ చేస్తున్నాం. వచ్చే వారంలో ఆడియో విడుదల చేయనున్నాం”అని తెలిపారు. మంచు మనోజ్ మాట్లాడుతూ “రామ్‌గోపాల్‌వర్మకు నేను పెద్ద అభిమా నిని. ఆయన చేసిన రంగీలా, శివ సినిమాలు చూసి ఆయనతో ఎప్పటికైనా పనిచేయాల నుకున్నాను. ఈ సినిమా స్టోరీ చెప్పగానే నాకు చాలా నచ్చింది”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో తుమ్మ లపల్లి రామసత్యనారాయణ, అంజి తదితరులు పాల్గొన్నారు.