Home ఆంధ్రప్రదేశ్ వార్తలు పవన్ పై పరోక్ష విమర్శలు చేసిన వర్మ!

పవన్ పై పరోక్ష విమర్శలు చేసిన వర్మ!

Varma-And-Pawanఅమరావతి: ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పై పరోక్ష విమర్శలు చేశారు. పదో క్లాస్ లో 32 మార్కులతో పాసై, ‘తెలంగాణలో ఆంధ్రులను కొడుతున్నారు’ అని చెప్పిందని ఎవరని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలను ఆర్జీవీ ప్రస్తావించారు. ‘కింద ప్రస్తావించిన మాటలన్నీ ఎవరు చెప్పారు? నేను ఊరికే అడుగుతున్నా’ అంటూ ఓ క్లిప్ ను వర్మ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

అందులో ‘జగన్ అసెంబ్లీకి రాకుండా పోరిపోయాడు. జగన్ చిన్న కోడికత్తికే గింజుకున్నాడు. తెలంగాణలో ఆంధ్రులను కొడుతున్నారు. రాయలసీమ రౌడీలను గోదాట్లో కలిపేస్తా. పాకిస్థాన్ తో యుద్ధం వస్తుందని నాకు ముందే తెలుసు’ అంటూ వేర్వేరు సందర్భాల్లో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ వర్మ ట్వీట్ చేశారు. అంతే కాదు ఎవరు చేశారో చెప్పాలంటూ నెటిజన్లకు ఆయన సవాల్ విసిరారు. ప్రస్తుతం ఆర్జీవీ చేసిన పోస్ట్ సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతోంది.

Ram Gopal Varma has criticized Pawan Kalyan