Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

‘లక్ష్మీస్ ఎన్‌టిఆర్‌’ ఫస్ట్ లుక్ విడుదల

Lakshmis-NTR-Full

వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ.. గతంలో ప్రకటించిన విధంగానే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సినీ నటుడు నందమూరి తారక రామరావు జీవిత గాథపై తెరకెక్కిస్తున్న చిత్రానికి ‘లక్ష్మీస్ ఎన్‌టిఆర్‌’ అనే టైటిల్ ని పెట్టారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని మంగళవారం సోషల్ మీడియా వేదికగా ఆయన విడుదల చేశారు. ఎన్‌టిఆర్‌ జీవితానికి సంబంధించిన కొన్ని వెలువడని విషయాలను ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేస్తానని వర్మ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో తారగణం గురించి వర్మ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఇప్పటికే రక్తచరిత్ర, వంగవీటి, బెజవాడ వంటి బయోపిక్ లు తెరకెక్కించిన వర్మ.. ఆ చిత్రాల ద్వారా పలు వివాదాలకు తెరతీశారు. కాగా ఇప్పడు ఎంతో మంది అభిమాన నటుడు, రాజకీయ నాయకుడైన సీనియర్ ఎన్‌టిఆర్‌ జీవితగాధపై చిత్రాన్ని తెరకెక్కించడం.. దానికి ‘లక్ష్మీస్ ఎన్‌టిఆర్‌’ అనే టైటిల్ పెట్టడం.. వివాదంగానే మారింది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ టైటిల్ పై పలువురు అసంతృప్తి వ్యకపరుస్తున్నారు. మరి ఆర్ జివి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం అభిమానుల్ని ఆకట్టుకుంటుందో.. లేక మరిన్ని వివాదాలకు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే..

Comments

comments