Search
Sunday 23 September 2018
  • :
  • :

టిఎస్‌ఎఫ్‌డిసి చైర్మన్‌గా పూన్కూర్ రామ్మోహన్‌రావు ప్రమాణ స్వీకారం

TSFC

తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ (టిఎస్‌ఎఫ్‌డిసి) తొలి చైర్మన్‌గా పూన్కూర్ రామ్మోహన్‌రావు సోమవారం హైదరాబాద్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ప్రస్తుతం తెలుగు చిత్రసీమ అద్భుతమైన విజయాల్ని సాధిస్తోంది. బాహుబలి దారిలోనే పలువురు అగ్ర హీరోల సినిమాలు దేశవ్యాప్తంగా సత్తా చాటుతున్నాయి. ఇలాంటి తరుణంలో హైదరాబాద్‌ను భారతదేశ చలన చిత్ర పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దాలనే ధృడ సంకల్పంతో ముందుకు పోతున్నాం. స్టూడియోల నిర్మాణం కోసం హైదరాబాద్ శివార్లలో పెద్ద ఎత్తున స్థలాల్ని కేటాయించాలని నిర్ణయించుకున్నాం. దీంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్‌లో ఓ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌ను నెలకొల్పబోతున్నాం. ఏ ప్రాంతంలో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ నెలకొల్పాలనే విషయంలో సిఎం కెసిఆర్ తుది నిర్ణయం తీసుకుంటారు. ఇక సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ ప్రక్రియ పూర్తయితే నిర్ధిష్టమైన టిక్కెట్ రేట్లను నిర్ణయించే అవకాశం కలుగుతుంది. దాదాపు వంద మండలాల్లో కొత్త థియేటర్లను నిర్మించాలనే ఆలోచనతో ఉన్నాం’ అన్నారు. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి, ఎంపీలు కె.కేశవరావు, బాల్క సుమన్, ప్రభుత్వ సలహాదారుడు కెవి రమణాచారి, దిల్‌రాజు, బివిఎస్‌ఎన్ ప్రసాద్, అల్లు అరవింద్, ఆది శేషగిరిరావు, తమ్మారెడ్డి భరద్వాజ, అల్లాణి శ్రీధర్, సానా యాదిరెడ్డి, ఎన్.శంకర్, సుమన్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మురళీమోహన్ రావు, కార్యదర్శి సునీల్ నారంగ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments