Home జాతీయ వార్తలు ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ బిజెపి ప్రభుత్వం: రమణ్‌సింగ్

ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ బిజెపి ప్రభుత్వం: రమణ్‌సింగ్

Raman Singhగోరఖ్‌పూర్: ఛత్తీస్‌గడ్‌లో బిజెపి నాలుగవ సారి అధికారం చేపట్టడం ఖాయమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 12, 20 తేదీలలో రెండు విడతలుగా జరిగాయి. సోమవారం గోరఖ్‌పూర్‌లోని గీతా ప్రెస్(భగవద్గీతను ప్రచురించే సంస్థగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది)ను సందర్శించిన రమణ్ సింగ్ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఛత్తీస్‌గఢ్‌లో బిజెపి పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని, ఇతర పార్టీలతో జత కట్టే అవకాశం లేదని చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌లో పోలింగ్ పూర్తయింది.

డిసెంబర్ 11న వోట్ల లెక్కింపు జరుగుతుంది. 2003, 2008, 2013లో బిజెపి సొంతంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. బిజెపి తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంటుందన్న విశ్వాసం ఉంది, అని ఆయన జోస్యం చెప్పారు. ఒపీనియన్ పోల్స్ గురించి ప్రశ్నించినపుడు, ప్రతి ఒక్కరికి వారి సొంత విశ్లేషణలు ఉంటాయి. అయితే నాకు మాత్రం ప్రజల విశ్లేషణ మాత్రమే తెలుసు. బిజెపి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని చెప్పగలను, అంటూ రమణ్‌సింగ్ స్పష్టం చేశారు.

Raman Singh Confident Of Retaining Power, Raman Singh visits Gita Press in Gorakhpur, Chattisgarh assembly polls