Home మెదక్ రమణీయం… రామయ్య కళ్యాణం

రమణీయం… రామయ్య కళ్యాణం

ramమన తెలంగాణ/వెల్దుర్తి : శ్రీరామనవమి వేడుకలు మండలంలోని పలుగ్రామాల్లో అట్టహాసంగా జరిగాయి. మండల పరిధి కుకునూర్ సీతారామ ఆలయం, పంతులుపల్లి హనుమాన్ దేవాలయం, వెల్దుర్తిలోని మల్లయ్యపంతులుగుడి, విఠలేశ్వర దేవాలయాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగదభిరాముడి కళ్యాణం మహోత్సవం ఆధ్యంతం రమణీయంగా సాగింది. శ్రీసీతారామచంద్రస్వామికి మహిళలు ఒడిబియ్యం పోసి త మ మొక్కులు చెల్లించుకున్నారు. రాములోరికళ్యాణంతో ఆలయప్రాగణాలన్ని రామనామజపంతో మారుమ్రోగా యి. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య జరిగిన ఈ అపురూప దృశ్యాలను తిలకించడానికి భక్తులు విశేష సంఖ్యలో హాజరయ్యారు. అంతకుముందు రాములోరిని భాజా భజంత్రీలు, డప్పుచప్పుళ్ళ మధ్య పెళ్ళిమండపంలోకి పల్లకిలో ఊరేగింపుగా తీసుకవచ్చారు. సాయంత్రం సమయంలో సీతారాముల ఉత్సవ విగ్రహాలను, శ్రీరాముడి భారీకటౌట్‌ను యువకులు పట్టణంలో ఊరేగించారు. రాత్రి సమయంలో విఠలేశ్వరస్వామి దేవాలయం వద్ద బోనాలు, రథం ఊరేగింపు చేపట్టారు.
చేగుంట : మండల కేంద్రంలోని హన్‌మాన్‌దేవాలయం లో ఘనంగా సీతారాముల వారి కళ్యాణం నిర్వహించారు. ఆదివారం ఉదయం నుండి ఆయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం సీతారాముల వారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. చేగుంటలో శ్రీ హన్‌మాన్ దేవాలయంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు తీగల భూమలింగం గౌడ్ దంపతులు ముఖ్య అతిథిగా హజరై కళ్యాణంపై కూర్చున్నారు. ముందుగా సీతారాములవార్లకు పట్టు బట్టలు,తలంబ్రాలు డప్పు చప్పుల్ల మద్య తీసు కవచ్చారు. శ్రీరాముల వారి కళ్యాణం అనంతరం భక్తులకు అన్నదానం చేసారు. కార్యక్రమంలో కమిటీ సభ్యు లు కూన రాములు, అయిత చంద్రమౌళి , మాజీ సర్పంచులు మ్యాకల నర్సింలు, అయిత శంక రయ్య,ఆర్యవైశ్య సంఘం అద్యక్షులు టి నగేశ్, ప్రదాణ కార్యదర్శి రఘురాములు, సహర వెంకటి, గణేశ, బాలేశం, టిహన్మయ్య, నగభూశనం, చందవీరేశం, రమేశ్, దివాకర్, ప్రకాశ్, సి ద్దయ్య, రాజు, బాగ్యరాజ్, పాటిల్, సత్యం, యాదగిరి, రవి, రమణ, మహేశ్, వెంకటేశం, శ్రీను, నరేశ్, పరంజ్యోతి, శశి, శ్రీధర్, కృష్ణ, శ్రీను, రమణ పాల్గొన్నారు.
చిన్నశంకరంపేట : శ్రీ సీతారాముల కళ్యాణం అంగరం గ వైభవంగా నిర్వహించారు. మండల కేంద్రమైన చిన్నశంకరంపేటలోని అనంత పద్మనాభస్వామి గుట్టపై ఆదివారం శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా జరిగింది. మండల కేంద్రంతో పాట చుట్టు పక్కల గ్రామాల నుండి పెద్ద పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ సీతారాముల కళ్యాణమహోత్సవాన్ని తిలకించారు. ఆలయ అర్చకలు తీర్థ ప్రసాదాలను అదించగా అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.
కొల్చారం : శ్రీరామ నవమిని పురస్కరించుకొని మండల పరిధిలోని రంగంపేట, తుక్కాపూర్, పైతర తదితర గ్రా మాలలో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలను అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఆదివారం రం గంపేటలో ఎంపిపి అరిగె రజిని రమేష్‌కుమార్, తుక్కాపూర్‌లో టిఆర్‌ఎస్ నాయకులు ఆంజనేయులు, పైతరలో ఆత్మకమిటీ చైర్మన్ కరుణమల్లారెడ్డి సీతారాముల కళ్యా ణం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ఆలయాలను అందంగా ముస్తాబుచేసి ఒక రోజు ముం దుగానే పచ్చని తోరణాలతో పందిళ్లు వేశారు. కళ్యాణం అనంతరం అన్నదాన వితరణ నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సీతారాముల కళ్యాణాన్ని తిలకించారు.