Home ఆఫ్ బీట్ రెప్ప కరువైన రామప్ప

రెప్ప కరువైన రామప్ప

Ramappa-Templeతెలంగాణ రాష్ట్రంలోని ఒకప్పటి కాకతీయ సామ్రాజ్య వైభవం గుర్తుగా నిలిచిన శైవ దేవాలయాలు నశించి పోవలసిందేనా? కాకతీయ రాజులు పాలించిన కాలాన్ని స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చును. వారు ఎన్నో శైవ దేవాలయాలను కట్టించినారు. దానిలో చెప్పుకోదగ్గది ముఖ్యమైనది రామప్ప గుడి. ఈ దేవాలయం కాకతీయరాజు గణపతిదేవుని సేనాధి పతి, రాచెర్లరుద్రుడు 13-14వ శతాబ్దంలో నిర్మించారు. రామప్ప గుడిలో కొలువైనది ‘రామలింగేశ్వరుడు’గా పిలువబ డుతున్న శివుడైనా ప్రధాన శిల్పి అయినా ఆ గుడి రామప్ప గుడిగా ప్రసిద్ధికెక్కినది. రామప్ప గుడి ప్రపంచంలోనే ఉత్తమో త్తమైన దేవాలయం. ఈ గుడి శిల్పకళ అప్పటి శిల్పుల కళా నైపుణ్యాన్ని చాటి చెప్పుతున్నది. ఈ గుడి గట్టినల్ల గ్రానైట్ రాయితో నిర్మించబడినది. ఇప్పటివరకు ఇటువంటి రాయిని ఏ గుడి నిర్మాణానికి ఉపయోగించలేదు. ఇది చాలా అరుదైన రాయి. శతాబ్దాలుగా చీమలు రామప్ప గుడి పునాదులలోని ఇసుకను కొద్దికొద్దిగా తోడేస్తున్న కారణంగా గుడి కుంగిపోతు న్నది. ‘గొల్లవారిగుడి’తో సహా రామప్ప గుడి పరిసరాలలో ఉన్న మరో ఆరు గుళ్ళను ప్రభుత్వం పునర్నిర్మించాలి. రామ ప్ప గుడి దక్షిణాన కామేశ్వరాలయం, గుడి లోపల ఉన్న నంది మంటపం పునర్నిర్మాణానికి ప్రభుత్వం పూనుకోవాలి. గుడి పరిసరాలలో జరుగుతున్న పారిశ్రామిక కట్టడాలవల్ల ఏర్పడిన కాలుష్యాన్ని నివారించడానికి గట్టి చర్యలు తీసుకో వాలి. వరంగల్ నగరంలో ఉన్న మరో చారిత్రక కట్టడం వరం గల్ కోట. ఈ కోట లోపల జరుగుతున్న అక్రమ నిర్మాణాలను వెంటనే అరికట్టి పునరుద్ధరించవలసిన అవసరమెంతో ఉన్న ది. కోటలో బయటి, లోపలి గోడలను పునర్నిర్మించి వరంగల్ కోటకు పూర్వవైభవాన్ని సమకూర్చాలి. పర్యాటకులను ఆక ర్షించే విధంగా, కోట పూర్వవైభవాన్ని తలపించేటట్లు ఆ కాలంలో వేషధారణ, గుర్రాలను, ఏనుగులను, ఆనాటి సైనిక దళాలను సజీవంగా ప్రదర్శించినట్లైతే ఎంతో బాగుంటుంది. ఆనాడు ఉపయోగించిన ఆయుధాలను ప్రదర్శనశాలలో పెట్టి నట్లయితే చాలామంది పర్యాటకులు వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా ప్రభుత్వానికి కూడా ఆదాయం సమకూరు తుంది. ఇవేకాక మరెన్నో శైవ దేవాలయాలు కేంద్ర ప్రభుత్వ, రాష్ట్రప్రభుత్వ, దేవాదాయ శాఖల జాబితాలో లేనందున వాటి బాగోగులు పట్టించుకున్నవారు లేరు. ఇలాంటి గుళ్ళను కూడా గుర్తించి వారి జాబితాలో చేర్చుకొని మన వారసత్వ సంపదగా కొత్తతరానికి అందించితే బాగుంటుంది. ఇలాంటి దేవాలయ సంపదను దత్తత తీసుకొని ఆదుకోవ డానికి ముందుకువచ్చిన వ్యక్తులకు, ఎన్‌జిఒ, కార్పొరేట్ సంస్థలకు, ఆదాయ పన్నులో రాయితీ కల్పించినట్లయితే ఇంకాచాలా మంది ఈ మంచి కార్యానికి ముందుకు వస్తారు.
రామప్ప దేవాలయం
రామప్ప దేవాలయాన్ని రామలింగేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తున్నారు. ఈ దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ నగరానికి 77 కి.మీ, హైదరాబాద్ నగరానికి 157 కి.మీ దూరంలో 13-14వ శతాబ్ద కాలంలో పాలంపేట అనే చిన్న గ్రామం వెంకటాపూర్ మండలంలోని లోయ ప్రాంతం లో నిర్మితమైంది. ఈ దేవాలయాన్ని కాకతీయ రాజు గణపతి దేవుని సేనాధిపతి రాచెర్ల రుద్రుదు స్థాపించినాడు. దేవాల యానికి మూడు దిక్కులా ప్రవేశ ద్వారాలు, ఎత్తైన వేదిక పై గర్భగృహం, అంతరాలు మండపం, స్థంభాలపై పురాణ పాత్ర లు చెక్కారు. అక్కడి రాళ్ళను కానీ స్థంభాలను కాని తాకిన ట్ట్లైతే చక్కని సంగీతం వినపడుతుంది. ఈ దేవాలయం రామప్ప అనే శిల్పకారునిచే నిర్మించబడిన శివాలయము కావున అతని పేరుపై ప్రసిద్ధి చెందినది. ఒక శిల్పకారుని పేరు దేవాలయానికి పెట్టడం ప్రపంచంలోనే మొదటిసారి. ఈ దేవాలయంలోని దేవుడుని శ్రీ రాముడు పూజించాడు. అందుచేత ‘రామలింగేశ్వరుడు’ అని పిలుస్తు న్నారు. ప్రతిష్ఠాత్మకమైన రామప్ప దేవాలయం శిథిలావస్థకు చేరుకుంటున్నది. దేవాలయ పునాదులు కదులుతున్నాయి. పునాదుల క్రింద చీమలు ఇసుకను త్రవ్వి పునాది రాళ్ళను కదిలిస్తున్నాయి. దీనిని ఆపకపోతే అంత పెద్ద కట్టడం కూలి పోయే ప్రమాదం త్వరలోనే సంభవించగలదు. దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కల్యాణ మంటపాన్ని పునరుద్ధ రణ నిమిత్తము పడకొట్టారు. వాటి కట్టదపు రాళ్ళను చుట్టు పక్కల పడవేశారు. అవి దొంగల చేతిలోపడి కనిపించకుండా పోయే ప్రమాదం ఎంతైనా కలదు. కళ్యాణ మంటపం పునర్నిర్మించడానికి ఇప్పటివ రకూ పురావస్తు శాఖ పూనుకోలేదు. బడ్జెట్లో తగిన నిధులు కేటాయించలేదని తెలుపుతున్నారు. రామప్ప దేవాలయం ఇరుపక్కల చిన్న చిన్న శివుని గుళ్ళు ఉన్నా యి. చుట్టుపక్కల మరికొన్ని గుళ్ళు కూడా ఉన్నాయి. రామప్ప దేవాలయంలో ఉన్న బ్రహ్మాండమైన నంది విగ్రహాన్ని శివుని విగ్ర హం ఎదురుగా అతని ఆజ్ఞ కొరకు వేచి ఉన్నట్లు ప్రతిష్ఠించారు. అటువంటి నంది విగ్రహంపై కప్పు లేక ఎండకు ఎండి, వాన కు తడుస్తున్నది. వచ్చిన భక్తులందరు వారి పూజలో భాగం గా విగ్రహంపైన అంతటా కుంకుమ చల్లుతున్నారు. విగ్రహం పైనే దీపాలు వెలిగిస్తు న్నారు. కొబ్బరి కాయలు కొడుతు న్నారు. ఇలా చేయడం వలన నంది విగ్రహం శిల్ప కళా సంపద దెబ్బతినే అవకాశమున్నది. రామప్ప గుడిలో కోట్ల గది ఉన్నది. దానిలో విలువైన శిల్పాలు చుట్టూ చెల్లాచెదు రుగా పడి ఉన్నాయి. వాటికి సరైన రక్షణ కల్పించలేదు. కొన్నింటిని దొంగతనంగా ఎత్తుకు పోతున్నారు.
వరంగల్ కోట
వరంగల్ కోట నిర్మాణం 13వ శతాబ్దంలో కాకతీయ రాజు గణపతి దేవుని పాలనా సమయంలో క్రీ.శ. 1199లో మొద లైంది. అతని పుత్రిక రాణి రుద్రమదేవి క్రీ.శ 1261లో పూర్తిచేశారు. వరంగల్ కోటపై అరుదైన శ్రేష్ట మైన థోరీన్ శిల్పకళ కనపడుతుంది. అక్క డ కొన్ని కాకతీ యుల కాలం నాటి పురాతన దేవాలయాలు, శిల్పాలు ఉన్నాయి. తోరియన్ కళా త్మక ద్వారాలు, స్తంభాలు 19 కి.మీ. విస్తీర్ణం లో వరంగల్, హనుమకొండ దారిలో పరుచుకొని ఉన్నాయి. ఈ కోట ఎన్నో యుద్ధాలకు, తిరుగు బాట్లకు సాక్షిగా చరిత్రలో నిలిచిం ది. దీని ప్రధాన ముఖద్వారాన్ని ఒకే రాతితో చెక్కారు. నాలుగు బ్రహ్మాండమైన స్తంభాల తో కూడి ఉన్నది. వరంగల్ కోట చుట్టూ మూడు వరుసలలో రక్షణ కల్పించారు. అంటే కోట లోపల రక్షణ ఎంత ఉందో మనకు అవగతమవుతుంది. అటువంటి చరిత్రాత్మక కోట నేడు నిర్లక్షానికి గురై పూర్తిగా పడిపోయే స్థితిలో నాలుగు గోడలు మిగిలాయి. కోట లోపల చట్ట విరుద్ధంగా నిర్మాణపు పనులు జరుగుతున్నాయి. కోట చుట్టూ పరిసరాలను కూడా సరిగ్గా పోషించడం లేదు. చుట్టు పక్కల ఉన్న దేవాలయాలన్నీ శిథి లావస్థకు చేరుకున్నాయి.
గణపేశ్వరాలయం
గణపేశ్వరాలయం ‘కూసుమంచి’ అనే చిన్న గ్రామంలో ఖమ్మం జిల్లా జాతీయ రహదారిపై ఉన్నది. ఈ దేవాలయాన్ని వయా పర కాల లేదా ములుగు గ్రామం నుంచి చేరుకోవచ్చును. గణపేశ్వరాల యాన్ని క్రీ.శ. 1234వ సంవత్సరంలో కాకతీయ రాజు గణపతి దేవుని కొలు వులో సైన్యాధ్యక్షుడుగా పని చేసి న రేచెర్ల రుద్రుని కుమారుడు గణపిరెడ్డి నిర్మించారు. ఇది రాణి రుద్రమ దేవి అభిమాన దేవాలయాల్లో ఒకటి. ఈ దేవాలయంలో ముఖ్యమైన దేవుడు శివలింగాకారములో వెలిసిన పరమశివుడు. ఇక్కడ శివలింగం 12 అడుగుల ఎత్తు లో గుడిలో పల సగం వరకు భూ మిలో దిగ పడి పోయి ఉన్నది. ఈ దేవాలయం చుట్టూ చిన్న చిన్న గుళ్ళు, ఒకపక్క శిథిలావస్థలో ఉన్న నాట్య మండపం మరో పక్క కాటేశ్వరాలయం ఉన్నాయి. ఈ దేవాలయంపై దండె త్తిన వారు, నిధి కొరకు వెతుకులాడే వారు ఇక్కడి ఐశ్వర్యాన్ని అంతా దోచుకొన్నారు. ఇది ఎన్నో శతాబ్దాలు నిర్లక్ష్యానికి గురై నది. చెక్కిన స్తంభాలన్నీ విరిగిపోయి గుట్టగా పడి ఉన్నాయి. విగ్రహాలన్నీ తాటి తోపుల్లో, పొలాల్లో పడి ఉన్నాయి.
త్రికూటం శివాలయం
త్రికూటం శివాలయం కాకతీయ రాజు గణపతి దేవుని కాలంలో సుమా రు 800 ఏళ్ల పూర్వం వరంగల్ జిల్లాలోని ము లుగు మండలం ఆత్మ కూరు గ్రామంలో నిర్మిత మైంది. అందరు ముందు కు వచ్చి ఈ కళావైభవా న్ని రక్షించి భావితరాల కు అందించాలని నా ప్రార్ధన.

-ఎం. నాగరాజ్, సెల్: 9849253207