Home వార్తలు పాటల పల్లకిలో ‘రామసక్కని రాకుమారుడు’

పాటల పల్లకిలో ‘రామసక్కని రాకుమారుడు’

rrఉదయ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఉదయ్, స్వప్న జంటగా ఉదయ్‌కల్లూరి దర్శకత్వంలో హారిక కల్లూరి, ఉదయ్ కల్లూరి నిర్మించిన చిత్రం ‘రామసక్కని రాకుమారుడు’. హేమచంద్ర సంగీతమందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్స్‌లో జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతాని రామకృష్ణగౌడ్ బిగ్ సీడీ, ఆడియో సీడీలను ఆవిష్కరించగా తొలి సీడీని మాజీ డిప్యూటీ సిఎం రాజయ్య అందుకున్నారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ “కొత్త నటీనటులు సినిమాపై ఆసక్తితో పనిచేశారు. అలాగే హేమచంద్ర అందించిన ఈ సినిమా సంగీతం బావుంది. ఉదయ్ దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా తనదైన ప్రతిభను చూపించాడు”అని అన్నారు. ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ “తెలుగువాడైన ఉదయ్ సినిమా మీద ఉన్న ప్యాషన్‌తో కెనడాలోనే మొత్తం సినిమాను చిత్రీకరించాడు. హేమచంద్ర మంచి సంగీతమందించాడు. సినిమా, ఆడియో పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను”అని తెలిపారు. ఉదయ్ మాట్లాడుతూ “ఈ సినిమా కోసం మూడేళ్ల పాటు బాగా కష్టపడ్డాం. సినిమాను అంతా కెనడాలోని అందమైన లొకేషన్లలో చిత్రీకరించాం. కెనడాలో చిత్రీకరించిన తొలి తెలుగు సినిమా ఇదే. సినిమాలో మంచి సందేశం కూడా ఉంటుంది. హేమచంద్ర మంచి సంగీతమందించారు”అని చెప్పారు. హేమచంద్ర మాట్లాడుతూ “ఉదయ్ ఎంతో అంకితభావంతో ఈ సినిమా చేశాడు. కథ వినగానే నాకు నచ్చింది. దాంతో సినిమాకు మ్యూజిక్ అందించాను”అని అన్నారు. ఈ కార్యక్రమంలో సాగర్, సాయి వెంకట్‌తో పాటు చిత్ర బృందం పాల్గొంది.