Home స్కోర్ ఆఫ్‌స్పిన్నర్ రమేశ్ పవార్ రిటైర్మెంట్

ఆఫ్‌స్పిన్నర్ రమేశ్ పవార్ రిటైర్మెంట్

7777777ముంబయి: భారత్ తరఫున 31 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడిన మాజీ ఆఫ్‌స్పిన్నర్ రమేశ్ పవార్(37) క్రికెట్ పోటీల నుంచి విరమించాడు. అతడు 15 ఏళ్లుగా ముంబయి రంజీ జట్టుకు కీలక సభ్యుడుగా ఉన్నాడు. దీంతో ఆయన 15 ఏళ్ల దేశీయ కెరీర్‌కు తెరపడింది. ముంబయి కోసం 442 ఫస్ట్ క్లాస్ వికెట్లు తీసుకున్న దిగ్గజంగా రమేశ్ పవార్‌కు గుర్తింపు ఉంది. తన కెరీర్ చివర్లో అతడు రాజస్థాన్, గుజరాత్‌లకు కూడా ప్రొఫెషనల్‌గా ఆడాడు. అతడికి హర్భజన్ సింగ్‌తో కూడా కలసి ఆడాడు . ‘క్రికెట్‌ను ప్రేమించిన నేను నిజాయితీగా ఆడాను. క్రికెట్‌లో ఏ కెపాసిటీలో ఆడమన్నా ఆడటానికి ఇష్టపడ్డాను.’అని రమేశ్ పవార్ చెప్పాడు. అతడు ఇకపై మాస్టర్స్ చాంపియన్స్ లీగ్‌లో ఆడబోతున్నాడు.