Home మహబూబ్‌నగర్ రామ్మోహన్‌రెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరడం దారుణం : డికె అరుణ

రామ్మోహన్‌రెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరడం దారుణం : డికె అరుణ

Dk-Arunaమన తెలంగాణ / హైదరాబాద్ : తన సోదరుడు, మక్తల్ ఎంఎల్‌ఎ చిట్టెం రామ్మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి టిఆర్‌ఎస్‌లో చేరడం సిగ్గు చేటు అని మాజీమంత్రి డి.కె.అరుణ అన్నారు. గాంధీభవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తమ తండ్రి నర్సిరెడ్డి ఆశయాలకు రామోమహన్‌రెడ్డి తూట్లు పొడిచారని విమర్శించారు. అధికార పార్టీ ఇలాంటి చర్యలకు పాల్పడడం దారుణమని మండిపడ్డారు. నియోజక వర్గ అభివృద్ధి, బీమా ప్రాజెక్టు కోసమే తాను పార్టీ మారుతున్నట్లు రామ్మోహన్‌రెడ్డి ప్రకటించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. తమ కుటుంబంలో చిచ్చుపెట్టే విధంగా టిఆర్‌ఎస్ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. తన తండ్రి రాజకీయ విలువలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే వారని, 1996లో తాను రాజకీయ ప్రవేశం చేసినప్పుడు టిడిపి నుంచి ఎంపిగా పోటీ చేశానని, అప్పట్లో తన తండ్రి కాంగ్రెస్ నుంచి మక్తల్ ఎంఎల్‌ఎగా ఉన్నారని, ఎన్నికల్లో తనకు సహకరించలేదని గుర్తు చేశారు.  సొంత బిడ్డగా తాను ఓటమి పాలైనా ఆయన విలువలకు కట్టుబడి కాంగ్రెస్‌కు మద్దతిచారని తెలిపారు. తాను పార్టీని వీడుతున్నట్లు కొంత మంది దుష్ప్రచారం చేస్తు న్నారని, ఎట్టి పరిస్తితుల్లో పార్టీ మారబోనని డి.కె.అరుణ స్పష్టం చేశారు. తమను ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని, అలా చేస్తే బిక్షమెత్తుకునైనా బతుకుతానే తప్ప విలువలను పక్కపట్టేది లేదన్నారు.