Home జాతీయ వార్తలు మళ్లీ మోడీనే పిఎం…. చిక్కుల్లో గవర్నర్

మళ్లీ మోడీనే పిఎం…. చిక్కుల్లో గవర్నర్

 

ఢిల్లీ: రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్ ఎన్నికల నియమావళి ఉల్లంఘించి ఇబ్బందుల్లో పడ్డారు. కల్యాణ్‌పై చేసిన ఫిర్యాదును ఎన్నికల సంఘం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు పంపించింది. రాష్ట్రపతి హోంశాఖకు పంపించనున్నారు. మార్చి 25న ఓ సమావేశంలో కల్యాణ్ సింగ్ మాట్లాడారు. మళ్లీ మోడీ ప్రధాని కావాలన్నారు. బిజెపి ప్రభుత్వం ఏర్పడటానికి కార్యకర్తలు అహర్నిశలు కష్టపడాలని సూచించారు. బిజెపి కార్యకర్తలు కష్టపడితే బిజెపి గెలపు సాధ్యకాదన్నారు. ఒక గవర్నర్ అయి ఉండి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడం ఇదే తొలిసారి అవుతుంది. యుపికి కల్యాణ్ సింగ్ ముఖ్యమంత్రిగా బాబ్రీ మసీదును కూల్చివేశారు. కల్యాణ్ సింగ్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు మోడీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందా? అని అందురూ ఎదురు చూస్తున్నారు. గతంలో కూడా మోడీ మళ్లీ పిఎం కావాలని పలుమార్లు అన్నట్టు సమాచారం.

 

Ramnath Forwards EC Complaint File to Central